వనపర్తి, మే 13(నమస్తే తెలంగాణ): వనపర్తి నియోజ కవర్గంలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలో 2,73,863 మంది ఓటర్లుంటే, 1, 82, 283 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్పీ రక్షితా మూర్తి మర్రికుంటలోని పాఠశాలలో ఓటును వేశారు. అలాగే ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పెద్దమందడి మండలం మంగంపల్లిలో,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గోపాల్పేట మండలం తిరుమలాపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెల్లవారుజామున ఉరుములు.. మెరుపులు రావడం, చిన్నపాటి చిరుజల్లులతో వాతావరణమంతా చల్లబడంతో ఓటర్లు పోటాపోటీగా వచ్చి ఓట్లు వేశారు. ఎండల ప్రభావం ఉంటుందని పోలింగ్‌ను మరో గంట అదనంగా ఎన్నికల కమిషన్ పెంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించిం ది. పార్లమెంట్ ఎన్నికలకు పట్టణ వలస ఓటర్లు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి వలస ఓటర్లను భారీగా రప్పించిన ఆయా పార్టీలు, పార్ల మెంట్ ఎన్నికలకు వలస ఓట్లను లెక్కలోకి తీసుకోక పోవ డంతో అసెంబ్లీకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కొంతమేర తగ్గినట్లయింది. కాగా, పార్లమెంట్ ఎన్నికలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షితామూర్తి పర్య వేక్షణ చేసి ప్రశాంత వాతావరణంలో ముగించారు.
పెబ్బేరు, మే 13: మండలంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో మొత్తం 48పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెబ్బేరు మున్సిపాలిటీలోనే 14 కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలాచోట్ల మధ్యా హ్నం వరకు పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. పోలింగ్ సరళిని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు.
కొత్తకోట, మే13: మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానా నికి సోమవారం ఎన్నికలు నిర్వహించగా ప్రశాంతంగా ము గిశాయి. మండలంలో 71.55శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠ శాలలో ఎన్నికల సరళిని ఎస్పీ రక్షితామూర్తి పరిశీలించారు. కానాయపల్లిలో 259 పోలింగ్ కేంద్రంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటిం గ్ సరళిని మాజీ ఎమ్మె ల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నే తలను అడిగి తెలుసుకున్నా రు. ఎమ్మెల్యే మ ధుసూదన్రెడ్డి పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు.
గోపాల్పేట, మే 13: గోపాల్పేట, రేవళ్లి మండలాల్లో ఎంపీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఓటు హక్కును వినిగించుకునేందు కు ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులుదీరారు. రేవల్లి మం డల కేంద్రంలో పోలింగ్ సరళిని మాజీ మంత్రి నిరంజ న్‌రెడ్డి పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. గోపాల్ పేట మండలంలోని జయన్నతిర్మాలాపురంలో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చి న్నారెడ్డి, ఏఐసీసీ స్టేట్ కోఆర్డి నేటర్ ఆధిత్యరెడ్డి ఓటుహక్కును వినియో గించుకున్నారు.
పెద్దమందడి, మే 13: మండలంలోని అన్ని గ్రా మాల్లో ఎంపీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు.
చిన్నంబావి, మే 13: మండలకేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం ఎంపీ ఎన్నికలు ప్ర శాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాష్‌రావు మండలంలోని పెద్దదగడలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పాన్‌గల్, మే13: మం డలంలోని వివిధ గ్రామా ల్లో ఓటింగ్ నమోదు ప్రశా ంతంగా జరిగింది. మండలంలోని మాందాపూర్, మాధవరావుపల్లిలో వృద్ధులు, వికలాంగులు వీ ల్చైర్లపై కూర్చోబెట్టి ఓట్లు నమోదు చేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ఆత్మకూరు, మే 13: మండలంలోని మూలమల్ల 186 పోలింగ్‌బూత్‌లో ఉదయం ఈవీఎం కొంతసేపు మొరా యించింది. జూరాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఠాణాకు వెళ్లినప్పటికీ ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్సై తెలిపారు. ఆత్మ కూరు పోలింగ్ కేంద్రం 207లో ఈవీఎంలు అటుఇటుగా పెట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు అధికారులతో కొంతసేపు వివాదం పెట్టుకున్నారు. నిబంధనల మేరకే ఈవీఎంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు నిర్ధారించడంతో వివాదం సద్దుమణిగింది. అరగంటపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5 గంటల వరకు 68.15 శాతం పోలింగ్ నమోదైంది.
మదనాపురం, మే 13: మండలంలోని ఆయా గ్రామా ల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో మొత్తం 21,056మంది ఓటర్లు ఉండగా 15,845 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 76.42 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎస్పీ రక్షితామూర్తి మదనాపురంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో తాసీల్దార్ అబ్రహం లింకన్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
వనపర్తి, మే 13: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పలు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ప్రముఖ హైకోర్టు జడ్జితోపాటు పలువురు ప్రముఖులు, జిల్లా ప్రజా ప్రతిని ధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు ను విని యోగించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలు గువాడ జెడ్పీహెచ్ఎస్లో మద్రాస్ హైకోర్టు జడ్జి నాగార్జున, నమస్తే తెలంగాణ దినపత్రిక వైస్ ప్రెసిడెంట్ చిరంజీవులు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించు కున్నారు. కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్పీ రక్షితాకృష్ణమూర్తి స్థానిక మర్రికుంట లోని ఎంపీపీఎస్‌లో ఓటుహక్కును వినియోగించుకున్నా రు. మున్సిపల్ చైర్మన్ మహేశ్ రాంనగర్ కాలనీలో, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ బండారు నగర్లో, ప ట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి మండలంలోని అంకూర్ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీపనగండ్ల, మే 13: మండలంలో మొత్తం 14 పంచాయతీలకుగాను 29 పోలింగ్ కేంద్రాల్లో 23,938 మంది ఓటర్లకుగానూ 15,664 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 65శాతం పోలింగ్ నమోదైనట్లు తాసీల్దార్ వరలక్ష్మి తెలిపారు.
ఖిల్లాఘణపురం, మే 13: పార్లమెంట్ ఎన్నికల్లో భాగం గా మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. యువకులు, వృద్ధులు, మహిళలు, పురుషులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులుదీరారు. దివ్యాంగులను కేం ద్రాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీల్ చైర్లో సిబ్బంది తీసుకెళ్లి ఓటు వేయించారు. భారీ బందోబస్త్ మధ్య ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
మండలంలోని సోలీపూర్‌లో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ రక్షితామూర్తి సందర్శించి ఎన్నికల సరళిని పరిశీలించారు. మానాజీపేటలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పో లింగ్ కేంద్రాలకు చేరుకొ ని ఎన్నికల ప్రక్రియను పరిశీలించి ఎన్నికల సరళిని నాయకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎమ్మె ల్యే మేఘారెడ్డి పరిశీలించారు.
అమరచింత, మే 13: అమరచింత జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 228 పోలింగ్ కేంద్రం లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటు హక్కు విని యో గించుకునేందుకు వచ్చిన ఓటర్లు పెద్ద ఎత్తున బారులు దీరా రు. ఈవీఎంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో మరొక ఈ వీఎంను ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఓటును విని యోగించుకున్నారు. మండలంలో 76శాతం పోలింగ్ నమోదైందని తాసీల్దార్ షేక్చాంద్పాషా తెలిపారు.