మహబూబ్‌నగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెం డు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటర్లు పోటెత్తడంతో భారీగా ఓటింగ్ న మోదైంది. ఎండ తీవ్రతకు భయప డి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సా యంత్రం పరుగులు పెట్టారు. ఆరు గంటలలోపు ఉన్న వారిని ఓటేసేందుకు అనుమతి ఇవ్వడంతో కొన్ని నియోజకవర్గాల్లో సోమవారం రా త్రి వరకు పోలింగ్ జరిగింది. దీంతో అధికారులు పోలింగ్ శాతాన్ని మంగళవారం విడుదల చేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 72.43 శాతం, నాగర్‌కర్నూల్‌లో 69.46 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన త ర్వాత అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్లను సీల్చేసి భారీ బందోబస్తు మధ్య డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు.. అక్కడి నుంచి స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఇదంతా పూర్త య్యే వరకు అర్ధరాత్రి దాటిపోయింది. మహబూబ్‌నగ్ కు సంబంధించిన ఈవీఎంలను పాలమూరు యూనివర్సిటీలో, నాగర్‌కర్నూల్‌కు చెందిన వాటిని నెలికొండ మార్కెట్ యార్డు గోదాంకు తరలించి సీల్ వేశారు.
ప్ర త్యేక పోలీసు దళాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చే శారు. లోక్‌సభ రిటర్నింగ్ అధికారులు రవినాయక్, ఉ దయ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూంలకు చేరడంతో.. ఇక వచ్చేనెల 4వ తేదీన జరిగే కౌంటింగ్‌పై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లే కౌంటింగ్ కూ డా ఎలాంటి పొరపాట్లు లేకుండా చేయాలని సిబ్బంది ని ఆదేశించారు. ఇదిలా ఉండగా, మహబూబ్‌నగర్ పా ర్లమెంట్‌లో 16,82,470 ఓట్లకుగానూ 12,18,587 ఓట్లు పోలయ్యాయి. నాగర్‌కర్నూల్ పరిధిలో 17,38, 254 ఓట్లకుగానూ 12,07,469 ఓట్లు పోలయ్యాయి. అయితే, మహబూబ్‌నగర్ సెగ్మెంట్ నుంచి 31, నాగర్‌కర్నూల్ నుంచి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్ శాతం పెరగడంతో ఆయా పార్టీల అంచనాలు తలకిందులవుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న ఘర్షణలు మినహా ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేదు. ఆయా పార్టీల కార్యకర్తలు తోపులాటలకు దిగినా పోలీసులు సర్దిచెప్పారు. మహబూబ్‌నగర్‌లో ఒకచోట, నాగర్‌కర్నూల్‌లో రెండు చోట్ల ఎన్నికలను బ హిష్కరించినా.. ఆయా పోలింగ్ కేంద్రాల్లో కొంతమం ది ఓట్లు వేశారు. పోలింగ్ సజావుగా సాగడంతో కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల సిబ్బందిని అభినందించారు.
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలైన ఓట్లను ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో తమకే లీడ్ వస్తుందని ధీమాలో ఉన్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల వారిని ఢీకొనే స్థాయిలో లేకపోవడంతో రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా ముక్కోణపు పోటీ ఏర్పడింది. ఎవరెన్ని అంచనాలు వేసినా ఓ టరు తీర్పు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నది. మరి ఓ టర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.
