పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించింది.
నాగర్ కర్నూల్ : పంచాయతీ కార్మికుల( Panchayat Workers) పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించింది. అనంతరం సమస్యలతో కూడిన పత్రాన్ని డీపీవో శ్రీరామ్కు అందజేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణలో 12,790 గ్రామ పంచాయతీల లో 60 వేల మంది గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పారిశుద్ధ కార్మికులు ఏళ్ల తరబడి పని చేసినా గాని పనికి భద్రత లేదని, కనీస వేతనాలు,ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమాలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
పంచాయతీ కార్మికులకు ప్రతినెల 50 కోట్ల రూపాయల వేతనాలు బడ్జెట్ కేటాయిస్తు న్నామని, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పి ఖాతాల్లో జమ కాలేదని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ నాయక్, కెవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగరాజు , గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి లింగస్వామి, సహాయ కార్యదర్శి పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

