రాజోళి, జనవరి 24 : పాన్‌కార్డు అప్డేట్తో వ చ్చిన మెసేజ్ లింక్‌ను నొక్కడంతో రూ.21 వేలు అకౌంట్ నుంచి మాయమైన ఘటన మండలంలోని తుమ్మిళ్లలో చోటు చేసుకున్నది. రాజోళి ఎస్సై అబ్దుల్‌ఖాదర్ కథనం ప్రకారం.. మండలంలోని తుమ్మిళ్ల గ్రామానికి చెందిన ధనుంజయరెడ్డి ఉండవల్లి మండలం బొంకూరులో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నె ల 10వ తేదీ పాన్‌కార్డు అప్డేట్ పేరుతో అధికారిక వాట్సాప్ (ఎంపీడీవో) గ్రూప్‌లో మెసేజ్ రావడం తో దాన్ని క్లిక్ చేయగా అందులో అడుగుతున్న ఓటీపీలను ఎంటర్ చేశాడు.
దీంతో తన అకౌంట్లో ఉన్న రూ.21వేలు ఖాళీ అయినట్లు గుర్తించి ఆన్లైన్లో మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైం పోర్టల్ 1930కు డయల్ చేసి సమాచారం అందించాడు. అనంతరం రాజోళి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.