Nagarkurnool | బిజినేపల్లి, జూన్ 3 : ప్రతి గ్రామంలోని రైతుకు నాణ్యమైన విత్తనాలు అందజేయడం జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్త సుమలత అన్నారు. బుధవారం మండలంలోని పాలెం గ్రామంలో గల రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కాగా 3వ తేదీన మండల స్థాయిలో రైతు నేస్తం కార్యక్రమం జరిగే రైతు వేదికలో విత్తన పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా వరి,జొన్న వంటి రకాలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. బిజినపల్లి మండలంలోని 9 క్లస్టర్లకు గాను 48 వరి, 24 జొన్న రకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీర్, నరేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాములు, ఏవో నీతి, ఏఈఓ విష్ణు, రైతులు ఉన్నారు.