మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 18 : నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. పీయూ ఉప కులపతికిగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ నియామకమయ్యారు. వీసీ నియామకంపై విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తుండటంతో పాటు సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది మొదటి క్వార్టర్‌కు సంబంధించిన నిధులు మాత్రమే విడుదల కాగా.. రెండో క్వార్టర్ నిధులు మంజూరు కాకపోవడంతో బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడూ.. అప్పుడూ అం టూ అధికారులు కాలం దాటవేస్తున్నారు. పీయూ లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ రూ.9కోట్లకు పైగా వెచ్చించి ఏర్పాటు చేసి.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించినా.. నేటికీ అథ్లెటిక్ కోచ్‌ను నియమించడం లేదు. కొత్త వీసీ పీయూ సమస్యలు తీర్చాలని విద్యార్థులు, ఒప్పంద అధ్యాపకులు, తాత్కాలిక బోధనేతర సిబ్బంది కోరుతున్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 18 : పాలమూరు యూనివర్సిటీ వీసీ గా ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్.శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కొత్తపల్లి గ్రామానికి చెందిన బీసీ యాదవ వ్యవసాయ కుటుంబానికి చెందిన గొండ్లాల నర్సయ్యయాదవ్, గొండ్లాల ఎల్లవ్వ దంపతుల కుమారుడు ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్. ఈయన ప్రస్తుతం జేఎన్టీయూ హైదరాబాద్‌లో సీనియర్ ప్రొఫెసర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీర్‌గా కొనసాగుతున్నారు. ఎంటెక్ బీటెక్, పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసి ఉస్మానియా యూనివర్సిటీలోనే అ సిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకయ్యారు. 2003 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జేఎన్టీయూ అనంతపురంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా, ప్రిన్సిపాల్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా, డైరెక్టర్‌గా పనిచేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో జేఎన్టీయూ హెచ్లో క్రీయాశీలకంగా పనిచేశారు. ఈ ఏడాది మే 21న పీయూ వీసీగా కొనసాగిన లక్ష్మీకాంత్‌రాథోడ్ మూడేళ్ల పదవీకాలం ముగియడంతో పీయూకు సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అహ్మద్ నదీంను ఇన్చార్జి వీసీగా ప్రభుత్వం నియమించింది. జూన్ 15వ తేదీ వరకు ఇన్చార్జి వీసీగా కొనసాగుతారని ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వుల్లో పేర్కొంది. గడువు ముగియడంతో వీసీ నియామకం జరిగే వరకు కొనసాగుతారని మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జేఎన్టీయూ ట్రిపుల్ఈ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్ కొత్త ఉపకులపతిగా నియామకం కావడంతో ఆయనను పూర్వ వీసీ ప్రొఫెసర్ ఎల్బీ.లక్ష్మీకాంత్‌రాథోడ్, పీయూ అధ్యాపకులు అభినందించారు.
పీయూలో పీజీ ఫస్టియర్, సె కండియర్ విద్యార్థులకు ఎటువం టి డిపాజిట్లు లేకుండా భోజన స దుపాయం కల్పించాలి. పీయూ లో మహిళా వసతి గృహంలో సరిపడా గదులు, సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త గా రూ.8కోట్లకుపైగా వెచ్చించి నిర్మించిన భవన ని ర్మాణం పూర్తయినా.. ఫర్నీచర్ ఏర్పాటు వేగవం తం చేయాలి. మహిళా వసతి గృహం వెంటనే అం దుబాటులోకి తీసుకురావాలి.
పీయూలో అడ్మిషన్ పొంది వసతి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి గృహంలో ఉండి చదువుకునేందుకు అనుమతించాలి. ముఖ్యంగా ఇంజినీరిం గ్, లా కళాశాలలు పీయూ క్యాంపస్‌లోనే ఏర్పాటు చేయాలి. రెగ్యూలర్ వైద్యుడిని నియమించి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి.
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పీయూను తీర్చిదిద్దేందుకు పదిహేనేండ్లుగా అన్ని అర్హతలు కలిగి చాలీచాలని వేతనాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఒప్పంద అ ధ్యాపకుల క్రమబద్ధీకరణకు కొత్త వీసీ సహాయ సహకారాలు అందించాలి. కేంద్రం ద్వారా మంజూరైన రూ.100 కోట్లు విద్యార్థుల యోగాక్షేమాలకు, పరిశోధన అభివృద్ధిలో కీలకమైన రంగాల్లో ఉపయోగించేలా ప్రతి ఒక్క అధ్యాపకుడు కృషిచేస్తారు.
2021లో ఇచ్చిన జీవో నెంబర్ 60 అమలు పర్చి పీయూలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించా లి. పీయూ పాలక మండలి అనుమతితో ప్రతి ఏటా వేతన పెంపు 12శాతం ఉండగా నిలిపివేశారు. వాటి బకాయిలు సిబ్బంది ఖాతాల్లో వెంటనే జమచేయాలి.