కోస్గి, అక్టోబర్ 7 : ఫార్మా కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. కోస్గి పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. అలాంటి కొడంగల్‌ను రాష్ట్రంలోనే మొ దటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయకుండా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టులను నెలకొల్పేందుకు పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజలు ఆశించినంత అభివృద్ధి జరగడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం, మ హేశ్వరం నియోజవర్గాల్లో ల్యాండ్ అక్విటేషన్ పూర్తి చేసి 14 వేల ఎకరాలను సిద్ధంగా ఉంచిందని, అక్కడి భూమిని వదిలి కొడంగల్‌లో నియోజవర్గంలోని దుద్యాల్ మండలంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి పూనుకున్నారన్నారు. ఫార్మాసిటీని రైతు లు వ్యతిరేకిస్తున్నా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని 30 శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు.
ముఖ్యమంత్రి చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన ఉదయం 7 గంటలకు పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకొని అక్కడినుంచి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి హకీంపేట్, ఆర్బీతండా మీదుగా దు ద్యాలలోని తాసీల్దార్ కార్యాలయం వర కు పాదయాత్ర చేపడుతామన్నారు. కొ డంగల్లోని రైతులు, యువకులు, ఫార్మా బాధితులు, నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ము గింపునకు ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి హాజరుకానున్నారన్నారు. కార్యక్రమం లో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మ న్ శాసం రామకృష్ణ, నాయకులు ఎండీ సలీం, కోట్ల జైపాల్, వెంకట్నర్సింహు లు, జనార్దన్‌రెడ్డి, శ్రీను, మోహన్‌గౌడ్, వెంకటేశ్, నర్సింహులు పాల్గొన్నారు.