మక్తల్, ఏప్రిల్ 27 : తెలంగాణ అస్తిత్వం మన బీఆర్ఎస్ పార్టీయేనని, స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధమై రాష్ట్రాన్ని సాధించిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ ఉన్నంతవరకు తెలంగాణ ప్రజలకు ఎలాంటి హానీ కలగదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకొని మక్తల్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు అధ్యక్షతన సోమవారం మక్తల్‌లో మాజీ ఎమ్మె ల్యే చిట్టెం పార్టీ జెండాను ఆవిషరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ వలస పాలకుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదనే లక్ష్యంతో స్వరాష్ట్రం ఏర్పడితేనే నీళ్లు, నిధులు, నియామకాలు మన తెలంగాణ ప్రజలకే దకుతాయనే లక్ష్యంతో 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ పార్టీని ప్రారంభించిన దినాన్ని ఘనంగా జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు.
ఆంధ్ర పాలకుల చెర నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి పొందించాలనే లక్ష్యంతో కేసీఆర్ మొకవోని దీక్షతో ప్రాణాలకు తెగించి ఉవ్వెత్తున ఉద్యమ సెగ లు తీసుకొచ్చి కేంద్ర మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని పేరొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, రాష్ట్ర ప్రజలందరూ ఈ పాలనను పాలద్రోలేందుకు సి ద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం మక్తల్ మండలం గుడిగండ్లలో ఆయన కార్యకర్తలతో కలిసి పార్టీ గులాబీ జెండాను ఆవిషరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, సర్పంచులు గాల్‌రెడ్డి, శ్రావణ్, నాయకులు శ్రీనివాస్ గుప్తా, ఆశిరెడ్డి, అన్వర్ హుస్సేన్, మొగలప్పా, మన్నాన్, జుట్ల, జుబేర్ పాషా, శంకర్, కృష్ణ, జుట్ల సాగర్, మహమూద్, నేతాజీరెడ్డి, ఈశ్వర్ యాదవ్, అమ్రేశ్, రఘు, అస్గర్ అలీ, అభిగౌడ్, సాధిక్, అంజిలతోపాటు ఉన్నారు.