ఉప్పునుంతల, మే 7 : అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి పాకిస్తాన్‌కు భారత్ తగిన బుద్ధి చెప్పిందని ఆర్మీ మాజీ హవల్దార్ రవీందర్రావు బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌పై పాకిస్తాన్ ఎన్నోసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ భారత్ ఏమాత్రం తొందరపడి చర్యలు తీసుకోలేదన్నారు.
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ఏమాత్రం తగ్గొద్దన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరిట 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు దాడి చేసి ధ్వంసం చేయడం గర్వకారణమన్నారు. సైనికులకు దేశ ప్రజలందరూ అండగా నిలిచి వారిలో ఆత్మైస్థెర్యం నింపాలన్నారు. ఒక వేళ యుద్ధంలోపాల్గొనడానికి తనకు అవకాశం వస్తే తప్పనిసరిగా పాల్గొంటానని తెలిపారు.