నాగర్‌కర్నూల్/అచ్చంపేట, మార్చి 8 : ఎస్ఎల్బీసీలో చిక్కుకు న్న కార్మికుల జాడ ఎంతకీ కానరావడం లేదు. 15 రోజులుగా ఎనిమిది మంది మృతదేహాల కోసం 11రెస్క్యూ టీమ్‌లోని దా దాపు 580 మందికిపైగా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం లేకపోతున్నది. రాడార్ద్వారా గుర్తించిన స్థానాల్లో శనివారం రెండు చోట్ల పూర్తిస్థాయిలో మట్టిని తొలగించినప్పటికీ కా ర్మికుల జాడ కనిపించలేదు. కేరళ నుంచి రప్పించిన ప్రత్యేక జాగిలాలు సైతం కార్మికుల జాడ గుర్తించలేకపోయాయి. మట్టి, బు రద నీరు ఉండడంతో రాడార్ మిషన్ ద్వారా గుర్తించిన స్థానాల్లోనే జాగిలాలు సైతం గుర్తించినట్లు రెస్క్యూబృందాలు పేర్కొంటున్నారు. టీబీఎం మిషన్కింద కార్మికులు ఇరుక్కొని ఉండొచ్చనే అనుమానంతో మిషన్‌ను ఎక్కడికక్కడే కట్ చేస్తూ దాని శకలాలను బయటకు తీస్తున్నారు.
అక్కడక్కడ దుర్గందం వస్తుందని చెబుతున్నప్పటికీ కట్టర్ మిషన్ పొగకు జాగిలాలు మృతదేహాలు ఉన్న స్థలాలను పసిగట్ట లేకపోతున్నట్లుగా తెలుస్తున్నది. కేరళ నుంచి జాగిలాలు రప్పించినా, మద్రాస్ ఐఐటీ టీమ్‌తో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నా మృతుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. మరోసారి నిపుణుల బృందం టన్నెల్‌ను పరిశీలించారు. మట్టి, బురదను తరలించేందుకు కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతు లు చేపట్టినట్లు చెబుతున్నా శనివారం వినియోగంలోకి రాలేదు. దీంతో టీబీఎం మిషన్‌ను కట్ చేస్తూ శకలాలను లోకో ట్రెయిన్ ద్వారానే బయటకు తరలిస్తున్నారు.
టన్నెల్ లోపల 13.950 కి లోమీటర్ల వరకు రెస్యూ బృందాలు వెళ్లాయి. మిగిలిన 50మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు చాలా ప్రమాదకర పరిస్థితి నెలకొన్నది. చివరి 50మీటర్లలో భారీగా బురద, మట్టి, బండరాళ్లు పేరుకుపోయి టన్నెల్ మొత్తం నిండిపోయి ఉన్నది. పైభాగంలో మెత్తగా ఉండి మట్టి, బండరాళ్లు కూలిపడే ప్రమాదముందని కార్మికులు చెబుతున్నారు. అయితే టన్నెల్ లోపల కం పార్ట్‌మెంట్‌లో మృతదేహాలు చిక్కుకొని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్జీఆర్ఐ, జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇం డియా, క్యాడవర్ డాగ్ బృందం, ర్యాట్మైనర్స్, రోబోటిక్ రం గాల నిపుణులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కార్మికుల జాడ మాత్రం కానరావడం లేదు.
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జాతీయ విపత్తు అని, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి సహాయక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సొరంగాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణతో క లిసి మాట్లాడుతూ టన్నెల్లో జరుగుతున్న ఆపరేషన్ గురించి వి వరించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్మీ కమాండెం ట్ పరిక్షిత్ మెహ్రా రెస్క్యూ వివరాలను వెల్లడించారు.
సహాయక చర్యల్లో అవాంతరాలను అధిగమిస్తూ వేగంగా చ ర్యలు కొనసాగుతాయని, లోపల ఆక్సిజన్ స్థాయి లేకపోవడం, నీరు అధికంగా ఊరడం, టీబీఎం ధృడమైన లోహ శకలాలు రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇ బ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇందుకు మంత్రి స్పందించి సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, రెస్క్యూ సిబ్బందికి సైతం ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందునా రోబోటిక్ నిపుణులతో సహాయకచర్యలు చేపట్టేందుకు రూ.4కోట్ల నిధులు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. మ ళ్లీ 11వ తేదీన టన్నెల్‌ను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. మంత్రి వెంట కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్‌గైక్వాడ్ రఘునాథ్, మిలటరీ ఇంజినీర్ వికాస్‌సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ప్రభాకర్, సింగరేణి, రైల్యే జీఆర్ఐ, హైడ్రా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.