జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 13 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో రోజు గురువారం ఉదండాపూర్ రిజర్వాయర్ కట్టపై భూ నిర్వాసితులు రిలేదీక్షలు చేపట్టారు. పునరావాస ప్యాకేజీ ఇచ్చే వరకు పనులు చేయొద ్దంటూ పనులను అడ్డుకోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి ఇప్పటి రేట్ల ప్రకారం పరిహారం పెంచి వన్‌టైం కింద ప్యాకేజీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రతిసారి అధికారులు వచ్చి సర్వే పేరుతో రాసుకొని కేవలం కాంట్రాక్టర్లకు రేట్లను పెం చుతున్నారే తప్పా తమకు ఇవ్వాల్సిన పరిహా రం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పరిహారాన్ని రూ.25 లక్షలు పెంచి ఇప్పిస్తామని హమీ ఇచ్చినా నేటి వరకు ఆ హామీని నేరవేర్చలేదన్నారు. ఆరు నెలల కిందట మం త్రులు, ఎమ్మెల్యేలు ప్రాజెక్టు పనులను పరిశీలనకొచ్చినపుడు నిర్వాసితులు పరిహారం పెం చి ఇవ్వాలని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. తాసీల్దార్ స్థాయి అధికారి నుంచి కలెక్టర్ స్థాయి అధికారి వరకు పునరావాస ప్యాకేజీ పెంపు గురించి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నామంటూ మాటలు చెబుతున్నారని, కానీ తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే పునరావాస ప్యాకేజీని పెంచి పరిహారాన్ని వన్‌టైం సెటిల్మెంట్ కింద డబ్బులు చెల్లించేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
పరిహారం పెంపు కోసం కృషి : ఎమ్మెల్యే
ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీ పరిహారం పెంపు కోసం కృషి చేస్తున్నానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదండాపూర్ నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. భూ పరిహారం చెల్లింపుల్లో పలు అక్రమాలు జరిగాయని, దీనిపై పునర్విచారణ జరిపించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. కొందరు పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చి ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని చూస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. నిర్వాసితు లంద రికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.