Womens Clash | నారాయణపేట రూరల్ మార్చి 18 : ఇద్దరు మహిళల మధ్య మాటా మాట పెరిగి ప్రాణాల మీదికొచ్చిన ఘటన నారాయణపేట జిల్లా నారాయణపేట మండల పరిధిలో వెలుగు చూసింది. మండల పరిధిలోని జిలాల్‌పూర్ గ్రామంలో ఇద్దరు మహిళల మధ్య ఇవాళ ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది.
గ్రామస్తుల కథనం మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని నర్సరీ వద్ద లక్ష్మి, బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగింది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బుజ్జమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది.
లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా.. ఆమెను హుటాహుటిన 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు