మాగనూరు, నవంబర్ 14 : ఇసుక ట్రాక్టర్ వాగులో బోల్తా పడిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన మాగనూరు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మాగనూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పరిమిషన్తో ట్రాక్టర్ల ద్వారా మాగనూరు పెద్దవాగు నుండి ఇసుక తరలిస్తున్నారని అయితే ఇసుక తరలించే సమయంలో ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ పాత వంతెన పైనుండి రోడ్డు పైకి ఎక్కుతున్న సందర్భంలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పిడంతో వెనకాలకు వెళ్లి వాగులో ట్రాలీ పడిపోవడంతో ఈ ఘటనలో మాగనూరు మండల కేంద్రానికి చెందిన ముష్టి నర్సింలు అనే వ్యక్తికి తాలుకు తీవ్ర గాయాలై తలకు కొద్దిగా గాయమై ఉండడంతో చికిత్స నిమిత్తం మాగనూరు ప్రభుత్వాసుపత్రి నుండి మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానికులు ఈ ఘటనలో ఎవరికి ప్రాణం ఇస్తాం జరగలేదని స్థానికులు తెలిపారు.