జోగులాంబ గద్వాల : జిల్లాలోని ఎర్రవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం ( Road Accident) జరిగింది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన భూషణ్ రెడ్డి తన భార్య తిమ్మమ్మ, కుమారుడు జగన్మోహన్ రెడ్డి తో కలిసి ద్విచక్రవాహనంపై పెబ్బేరు మండలం గంగారం గ్రామానికి బయలుదేరారు.
మార్గమధ్యలో ఎర్రవల్లి మండలం జింకలపల్లి స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ( National Highway ) ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భూషణ్ రెడ్డి భార్య తిమ్మమ్మ(33) అక్కడికక్కడే మృతి చెందింది. భూషణ్ రెడ్డి మోహన్ రెడ్డికి, కుమారుడుకి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటినా హైవే అంబులెన్స్ గద్వాల ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.