దామరగిద్ద : దామరగిద్దలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1989-90 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు చదువుకున్న పాఠశాలకు కృతజ్ఞతాపూర్వకంగా 10 నీల్ కమల్ కుర్చీలను బహుకరించారు. పూర్వ విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.
చాలా మంది ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకున్నారని, కానీ ఎవరూ ఈ విధంగా ముందుకు వచ్చి పాఠశాలకు బహుమతి ఇవ్వలేదని, ఇది అందరికీ ఆదర్శనీయని పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎం అశోక్, ఉపాధ్యాయులు శంభులింగం, అమృత్ తిప్పన్న, శ్రీనయ్య, జ్యోతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.