సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈవీఎంలను సిద్ధం చేసి తని ఖీలు చేస్తుండడంతో పాటు మరో వైపు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల క్రమబద్ధీకరణనూ కొనసాగిస్తున్నది. మాక్ పోలింగ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఎన్నికలకుముందస్తు చర్యలను చేపడుతున్నది. ఇందులో వచ్చే స్లిప్పులను జాగ్రత్తగా భద్రపర్చుతున్నారు. జిల్లాల వారీగా కేటాయించబడిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఎలక్ట్రానిక్స్యంత్రాల పనితీరును పర్యవేక్షించనున్నారు. వీటిని భద్రపర్చిన గోదాంలవద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలా మొదటిస్థాయి తనిఖీలు పూర్తయ్యాయి. పనిచేయని యంత్రాలుంటే ఉన్న తాధికారులకు నివేదించనున్నారు. ఈసారి కుటుంబానికి చెందిన ఓటర్లంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటేసేలా బీఎల్వోలు జాబితా రూపొందిస్తున్నారు.
– నాగర్‌కర్నూల్, జూలై 6 (నమస్తే తెలంగాణ)
నాగర్‌కర్నూల్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాబోయే సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుం డా అవసరమైన ఓటర్ల న మోదుతో పాటుగా పోలింగ్ కేం ద్రాలు, కీలకమైన ఈవీఎంలను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో అసెం బ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉం ది. దీంతో సాధారణంగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఈసారి ఒకే కుటుంబం ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసేలా బీఎల్వోల ద్వారా ఓటర్ల జాబితా ను రూ పొందిస్తున్నారు. దీంతో ఓటింగ్ శాతం పె రుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పు లు సైతం నిరంతరంగా జరుగుతోంది. ఇటీవల జూన్ 23 తో ఓటర్ల నమోదు పూర్తయ్యింది. త్వరలో తాజా ఓట ర్ల జాబితా వెల్లడి కానుంది.
కాగా ఒక ఇంటిలో ఆరుకంటే అధిక ఓట్లు ఉంటే ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. దివ్యాంగులు, సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లకు ఓటు హక్కు కోసం ప్రత్యేక అవగాహన చర్యలు తీసుకోనున్నారు. ఈ సారి నడవలేని స్థితిలో ఉన్నవ్యక్తులకు ఇంటి నుంచి ఓటు వేసే అ వకాశం కల్పించడం జరుగుతున్నందునా, అలాంటి ఓటర్లను కూడా గుర్తించి బీఎల్వోలు ధ్రువీకరించనున్నారు. మరో రెండు నెలల్లో మరోసారి ఓటర్ల నమోదు జరగనున్నది. 18ఏండ్ల్లు నిండిన ప్రతిఒక్కరూ ఎన్నికల నాటికి ఓటు హక్కు కలిగి ఉండేలా ఎన్నికల సంఘం ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్నది. ఇక గుర్తించిన పోలింగ్ కేంద్రా ల్లో తగి న వసతులను పరిశీలిస్తున్నారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యు త్, మంచినీరు, టాయిలెట్ల సౌకర్యాలను పరిశీలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్రాని పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించనున్నారు. విద్యా సంస్థల్లో ఓటు హ క్కు నమోదుపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించడం జరుగుతోంది.

కాగా అత్యంత ముఖ్యమైన ఈవీఎంలను, ఓటు వేసే యంత్రాలను అధికారు లు పరిశీలిస్తున్నారు. జిల్లాల వారీగా కేటాయించబడిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఎలక్ట్రానిక్ యంత్రా ల పనితీరును పర్యవేక్షించనున్నారు. ఈవీఎంల గోదాముల్లోకి ఇతరులు ప్రవేశించకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమతి ఉన్న అధికారులు, సిబ్బందినే గోదాంలోకి తనిఖీల తర్వాతే అనుమతిస్తున్నారు. ఇక ఈవీఎంలతో మాక్ పోలింగ్ సైతం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే స్లిప్పులను కూడా అత్యంత జాగ్రత్తగా భద్రపర్చుతున్నారు. ఇలా ప్రస్తుతం ఈవీఎంల మొదటిస్థాయి తనిఖీలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇందులో ఆయా రాజకీయ పార్టీలకు సైతం ఈవీఎంల నిర్వహణ, తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్లు వివరించడం జరుగుతోంది. తనిఖీల్లో పని చేయని యంత్రాలుంటే ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. ఇలా కలెక్టర్ల ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఎన్నికలకు తగిన ముందస్తు చర్యలను చేపడుతోంది.
మొదటి దశ తనిఖీలు చేపట్టాం
ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా ముందస్తుగా పోలింగ్ కేంద్రా ల గుర్తింపు చేపట్టాం. అవసరమైన సదుపాయాలు ఉండే లా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు, ఇతర యం త్రాలను తనిఖీలు చేపట్టడం జరుగుతోంది. జిల్లాకు కేటాయించిన 1,500 ఈవీఎంలు, 1,707 కంట్రోల్ యూనిట్లు, 1,330 బ్యాలెట్ యూనిట్లు, 1298వీవీ ప్యాట్లను గోదాంలో భద్రపర్చడం జరిగింది. ఓటర్ల నమోదు నిరంతరంగా చేపడు తాం. ఎన్నికల నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు వే సేలా ఓటరు నమోదు కొనసాగుతుంది.
– ఉదయ్‌కుమార్, కలెక్టర్, నాగర్‌కర్నూల్