మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 14 : నేటి నుంచి జిల్లాలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 15 శనివారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 గంటల నుంచి 12:30గంటల వరకు విద్యాసంస్థలు కొనసాగుతా యి.
పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యా హ్నం 1:15గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వారి కోసం ప్రత్యేక తరగతులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యా జమాన్యంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఈ ఆదేశాలను అమలు చేసేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ద్వారా అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోని ప్రభు త్వ పోలీసులైన్ ప్రాథమిక పాఠశాల, పీఎస్ రాంనగర్, సీసీకుంట మండలంలోని ఎంపీపీఎస్ ఉంద్యాల, ము చ్చింతల, దేవరకద్ర మడలంలోని ఎంపీపీఎస్ డోకూరు, ఎంపీపీఎస్ గోపన్‌పల్లి, అడ్డాకుల మండలంలోని ఎంపీపీఎస్ రాచాల, ఎంపీపీఎస్ కన్మనూర్, బాలానగర్ మండలంలోని ఎంపీపీఎస్ నేరెళ్లపల్లి, గండీడ్ మండలంలోని ఎంపీపీఎస్ బాల్సూర్గొండ తదితర పాఠశాలల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.