గద్వాల, అక్టోబర్ 20 : ఆకాశమంత అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చకుం డా రైతులు, ప్రజలను నిండా ముంచార ని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎ న్నికల హామీలో భాగంగా ఆరు గ్యారెంటీ లు, 13 అంశాలు, 420హామీలు చెప్పి నేడు ఏ ఒక్కటీ అమలు చేయడం చేతగాక ఉన్న పథకాలకు రాంరాం పా డుతున్నారని మండిపడ్డారు. వానకాలానికి సంబంధించి రైతుభరోసా ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద పైసలు లేవని వ్యవసాయశాఖ మంత్రి రైతులకు చావు కబురు చల్లగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే కొర్రీలు పెట్టే మోసకారి పార్టీ అని, ఏనాడూ రైతుల సంక్షేమానికి పాటుపడలేదన్నారు. సాగుచేసే వారికే రైతుభరోసా ఇస్తామని సీఎంతోపాటు మంత్రులు చెబుతున్నారని, ఎవరైనా సేద్యం చేయకుండా భూమిని పడావుగా ఉంచుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మందికి రైతుభరోసా ఇవ్వకుండా పొట్టకొట్టడం సరికాదన్నారు. సీఎం, మంత్రుల మాటల వ్యవహార శైలి వల్ల బ్యాంకులు కూడా రాష్ర్టానికి రుణసదుపాయం ఇ వ్వని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని ఆరోపించా రు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కింద రాష్ర్టానికి రూ.18వేల కోట్ల వరకు ఆదాయం వచ్చేదని, వీరివల్ల ప్రస్తుతం ఘననీయంగా పడిపోయిందన్నారు. ఆరేడు నెలల్లోనే ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవడం సిగ్గుచేటన్నారు. 24గంటల కరెంట్, సాగునీళ్లు, రైతుబంధు, ఎరువులు, విత్తనాలు ఎలాంటి కొరత లేకుండా ప్రతి రైతుకు కేసీఆర్ స ర్కారు అండగా నిలిచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో పడావుపడిన పొలాలన్నీ బీఆర్ఎస్ సర్కారులో పచ్చదనాన్ని సంతరించుకునేలా తీర్చిదిద్దామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతగాక రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజయ్‌కుమార్, జిల్లా నాయకు లు బాసు హన్మంతునాయుడు, బీచుపల్లి, మోనేశ్ తదితరులు పాల్గొన్నారు.