మహబూబ్నగర్ విద్యావిభాగం, సెప్టెంబర్ 12 : ఖాళీ క డుపుతో పాఠశాలలకు వస్తున్న బాలల ఆకలిని తీర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత విద్యా సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకం గా వివిధ జిల్లాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చే శారు. ఈ విద్యా సంవత్సరం పూర్తిగా అమలు చేయాలనే లక్ష్యంతో ఉండగానే ప్రభుత్వాలు మారాయి, వాటి ప్రా ధాన్యాలు మారుతున్నాయి.
ఫలితంగా ఇప్పటి వరకు ప్రజా పాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాం గ్రెస్ పేద విద్యార్థులకు అల్పాహారం అందించే విషయాన్ని ఇంకా పరిశీలించలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు దాటిం ది. విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దు స్తులు, మధ్యాహ్న భోజన కార్యక్రమాలపై దృష్టి సారించిన ప్రభుత్వం అల్పాహారంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం ఆహా రం ఇవ్వకుండా నేరుగా బడికి పంపిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య అధికంగా ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సర్వేలో గుర్తించింది. ఇలా వచ్చిన విద్యార్థులు మధ్యాహ్న భోజనం పెట్టే వర కు ఖాళీ కడుపులతోనే ఉంటున్నారని, వారికి అల్పాహారం అం దించాలని నిర్ణయించింది. రోజుకో రకమైన అల్పాహారం ఇ వ్వాలని నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ముందుగా ప్రతిజిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మొదట అమలు చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 45 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. విద్యార్థులు అల్పాహారంపై ఎక్కు వ ఆసక్తి చూపుతున్నారన్న విషయాన్ని కూడా అప్పుడు గుర్తించారు. గత సంవత్సరం అక్టోబర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యా సంవత్సరం వరకు కొనసాగించారు. వీటి బాధ్యతను ఎక్కువ చోట్ల మధ్యాహ్న భోజనం చేసే ఏజెన్సీలకే అప్పగించారు.
గత విద్యా సంవత్సరం అక్టోబర్ నుంచి పెట్టిన అల్పాహా రం బిల్లులు విడుదల చేసింది. కానీ మళ్లీ దీని అమలుపై స్ప ష్టత ఇవ్వలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరం ఇక అల్పాహా రం ఉండకపోవచ్చునని కొందరు అభిప్రాయ పడుతున్నారు. బిల్లులు చెల్లించే క్రమంలోనే వాటి అమలుపై కీలక ప్రకటన వస్తుందని అందరూ ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో అందరూ నిరాశ చెందారు.
గత విద్యా సంవత్సరంలో ఉమ్మడి పాలమూరులో పైలట్ ప్రాజెక్టుగా గుర్తించిన పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు చేశాం. ఈ పథకం అమలు, విద్యార్థుల ఆసక్తి తదితర అన్ని రకాలైన అంశాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విద్యా సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఆదేశాలు ఇంకా రాలేదు. రాగానే అమలుకు చర్యలు చేపడతాం.