వనపర్తి టౌన్, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికు లు ఓపిక, సమన్వయంతో పోరాటం చేయాలని, బలిదానాలు వద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగగా మాజీ మంత్రి డిపో వద్దకు చేరుకొని సంఘీభావాన్ని తెలిపి మా ట్లాడారు. కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, కొత్త ప్ర భుత్వం వస్తే మార్పు వస్తుందని చెప్పి మా యమాటలతో గత ప్రభుత్వాన్ని తిట్టి శరవేగంగా అన్ని పనులు జరిగిపోతాయని మో సపోయిన వారిలో ఆర్టీసీ కార్మికులు ఒకరని అందులో మొదటి స్థానంలో ఉంటారని గుర్తుచేశారు.
ప్రజాపాలన ప్రభుత్వంలో చర్చలు సర్వసాధారణమని ఆర్టీసీ కార్మికులు తమ డిపో ఎదుట తమ సమస్యలపై పోరాటం చేసేందుకు ఒక వేధిక లేకుండా చే యడం ప్రభుత్వ కర్కసత్వమే ంటని, ప్రభుత్వానికి ఏమి కష్టమొచ్చిందని మండిపడ్డారు. నిరసనలు ప్ర జాస్వామ్య పద్ధతి లో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ప్ర భుత్వానికి ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. సర్కారు ప్రతి వర్గాన్ని మోసం చేసిందని అడుగడుగున భయపడుతుందని ప్రజా సమస్యలను ఎదుర్కోనే శక్తి, ధైర్యం లేకా చివరకు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు పోలీసులను పరుగెత్తించి కేసు లు నమోదు చేస్తున్నారని, వారు కూడా అధికార పార్టీ మెప్పు పొందేందుకు తహతహలాడుతున్నారని ఆరోపించారు. పోలీసులు ని బంధనల మేరకు విధులు నిర్వర్తించడం మంచిదని లేకపోతే ప్రజల ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి, జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించాలన్నారు.
ఈ సంస్థ ఏర్పాటుకు దేశంలోనే తెలంగాణ రాష్ర్టానికి చరిత్ర ఉందని అందుకు నిజాం నవాబు యూరోప్ దేశాలను పరిశీలించి ఆర్టీసీ సంస్థను ప్రజా సంక్షేమం కోసం రైల్వే లైన్లకు అనుసంధానం చేస్తూ వ్యవస్థను నడిపారని, అనాటి నుంచి వేల కోట్ల ఆస్తులు కలిగిన సంస్థగా ఎదిగిందన్నారు. అటువంటి ఆర్టీసీ సంస్థను కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం, ఆస్తుల పరిరక్షణ కోసం కృషి చేసిందని చెప్పారు. ఆర్టీసీ సం స్థను ప్రభుత్వంలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ హయాంలో క్యాబినేట్ ఒక చట్టాన్ని రూపొందించి గవర్నర్ అనుమతి కోసం పంపారని ఆనాటి గవర్నర్ కాలయాపన వల్ల సాధ్యం కాలేదని అన్నారు. అడగకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం 44 శాతం వే తన సవరణ, ఐఆర్ 16శాతం ఇచ్చారని గుర్తుచేశారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని నేటి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణగద్రోక్కడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రా రాష్ట్రంలో ఆర్టీసీనంతా ప్రజాప్రతినిధులకు నడుపుకునేలా ధారదత్తం చేసి తెలంగాణలో వచ్చిన ఆదాయాన్ని సమానం చేసి చూపించారని గుర్తుచేశారు. లాభం తెలంగాణలో ఆంధ్రాలో ఆర్టీసీ ప్రైవేట్ పరం నడుపుకొనేలా చేశారన్నారు. అధికారంలోకి వచ్చి న వెంటనే ప్రభుత్వ సంస్థను విలీనం చేస్తామ ని చెప్పి రేవంత్‌రెడ్డి ఎగిరెగిరి మాట్లాడి మూ డేళ్లు గడిచిన విలీనం ఏమైందని ప్రశ్నించారు.
వెంటనే ఆర్టీసీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. అంతకుముందు మృతిచెందిన శంకర్‌గౌడ్‌కు నివాళులర్పించి కుటుంబాన్ని సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, అశోక్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, గిరి, జోహెబ్, హేమంత్, రాము, అస్లాం, ఎం.రాము, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ విశ్వనాథం, రవి, చలపతిరెడ్డి, నారాయణ, భాస్కర్, బీఆర్.గౌడ్, ప్రేమ్‌కుమార్ ఉన్నారు.