వనపర్తి/పెబ్బేరు, మే 11 : లోక్‌సభ ఎన్నికల్లో ప్ర శ్నించే గొంతుకైన ఆర్ఎస్పీని గెలిపించుకుందామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తిలోని గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా, సంతబజార్, పీర్లగుట్ట, చందాపూర్ రోడ్డు, రామాల యం వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలతో కలిసి ర్యాలీ చేపట్టారు. అలాగే పెబ్బేరు మండలంలోని పెబ్బే రు, చెలిమిల్ల, కంచిరావుపల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో రెండు తరాలకు సరిపడా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇతర దేశాలు తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారన్నారు. బీఆర్ఎస్ అధినేత చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుం చి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై కేసీఆర్‌పై కుట్రలు చేశారని.. ఆయనను ఓ డగొట్టి పొరపాటు చేశామనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమ లు చేయలేక ప్రజలను ఆరు లోకాలు తిప్పుతూ అరిగో స పెడుతున్నదన్నారు.
అధికారం కోసం ప్రజలకు ఎన్నో ఆశలు చూపిందన్నారు. హామీలను గాలికొదిలేసి ఎంపీ ఎన్నికల్లో ఓట్లడిగేందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. సీఎం ఎక్కడికెళ్లినా దేవుళ్లపై ఒట్లు వే స్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ మాటలు నమొద్దన్నా రు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన బూటకపు వాగ్దానాలను ఒకసారి గుర్తు చేసుకొని ఓటు వేయాలని సూచించారు. ప్రవీణ్‌కుమార్ ఉన్నతస్థాయి అధికారిగా పనిచేశాడని, ఆయన గెలిస్తే పార్లమెంట్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. నెలరోజులుగా ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, మీడియా కన్వీనర్ అశో క్, పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ కర్రెస్వామి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, మా ర్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్, నాయకులు బాలపీరు, పరంజ్యోతి, గులాం ఖాదర్, జోహెబ్, గిరి, నాగమ్మ, శారద, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, రవి, కృష్ణ, నాగన్నయాద వ్, అలేఖ్య, తిరుమల్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, రహీం, పాషా, రాము తదితరులు పాల్గొన్నారు.