వనపర్తి టౌన్, ఏప్రిల్ 24 : ఇంటర్మీడియ ట్ ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం శాలువా కప్పి సన్మానించారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన విద్యార్థులు అభిచరణ్ 445 మార్కులు, శివాజీ 466 మార్కులు, సాయిచరణ్ 427 మా ర్కులు సాధించడం అభినందనీయమని మా జీ మంత్రి పేర్కొన్నారు.
ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించి అండగా నిలిస్తే అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని గుర్తు చేశారు. స్వయంగా కష్టపడి చదివే విద్యార్థులకు అండగా ఉంటానని మాజీ మంత్రి భరోసానిచ్చారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు భానుప్రకాశ్‌రావు, లక్ష్మీనారాయ ణ, విష్ణుయాదవ్, ధర్మానాయక్, గిరి, భాగ్యరాజ్, నాగన్న, మహేశ్ పాల్గొన్నారు.