వనపర్తి,(నమస్తే తెలంగాణ),అక్టోబర్16 : వనపర్తి జిల్లా కేంద్రం విద్యా నిలయంగా విరాజిల్లుతుంది.పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో బీజం ప డిన క్రమంలో విద్యకు ప్రాముఖ్యత పెరుగుతూ వ చ్చింది. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యల ను అందిపుచ్చుకున్న వనపర్తి ఇటీవలి కాలంలో అ నేక కొత్త విద్యాసంస్థలకు నెలవుగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గురుకులాలను ఏర్పాటు చేసి నూతన ఒరవడికి సీఎం కేసీఆర్ అంకురార్పణ చేశారు.ఇదే స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లలో అనేక రంగాల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూ వస్తున్నది.
మెడికల్, జేఎస్టీయూలతో కొత్త ఊపు
విద్యాభివృద్ధిలో దూసుకుపోతున్న వనపర్తికి ఇటీవలే ప్రభుత్వ మెడికల్ కళాశాల, జేఎస్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు కావడం కొత్త ఊపును తెచ్చి పెట్టింది. అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్ కళాశాలను కూడా ప్రభుత్వం మంజూరు చేయడంతో విద్యాపరంగా నవశకం మొదలైంది. గతంలో మెడిసిన్, ఇంజినీరింగ్ వి ద్యాభ్యాసం చేయాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సిం దే. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కి ఆ కోర్సులన్నీ స్థానికంగానే అభ్యసించేలా రాష్ట్ర ప్ర భుత్వం కొత్త విద్యాలయాలను విరివిగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే మెడిసిన్ కళాశాల, అగ్రికల్చర్ బీఎస్సీ లోనూ విద్యార్థులు ఫస్టియర్ పూర్తి చేసుకున్నారు. అలాగే పెబ్బేరులో మత్స్య క ళాశాల, పెద్దమందడి మండలం వెల్టూరులో హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేసు కొని దిగ్విజయంగా కొనసాగిస్తున్న సంగతి విధితమే.
భవిష్యత్‌కు బంగారు బాటలు
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నది. ము ఖ్యంగా ప్రతి మండలకేంద్రంలో కేజీబీవీ లను ఏ ర్పాటు చేసిన తెలంగాణ స ర్కార్ వాటిని మరింత పటిష్ట పరుస్తున్నది. పదో తరగతి వరకే ఉన్న కేజీబీవీల్లో ప్రస్తుతం ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇలా ఒకటి, రెండేళ్లలో జిల్లా లోని మొ త్తం కేజీబీవీలు ఇంటర్ విద్యను అందుకోబో తున్నా యి. బాలికల విద్యకు ప్రాధాన్యత దిశగా చేపట్టిన కేజీబీవీ వ్యవస్థ ప్ర స్త్తుతం భరోసాగా నిలుస్తుంది.
మంత్రి సింగిరెడ్డి చొరవ అభినందనీయం
వనపర్తి నిత్య అభివృద్ధిని అకాంక్షించే మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌రెడ్డి చొరవ ఈ ప్రాంతంలో నిలిచిపోతుంది.మెడికల్ క ళాశాల, జేఎన్టీ యూ ఇం జినీరింగ్, బీఎస్సీ నర్సింగ్, అగ్రికల్చరల్ బీఎ స్సీ కళాశాలలను మంత్రి వనపర్తిలో ఏ ర్పాటు చేయిం చి జిల్లాకేంద్రానికి కొత్త ఊపు తెచ్చారు. ఊహించని విధంగా ఉన్నత విద్యలకు నెలువైన వనపర్తి నేడు రాష్ట్ర రాజధాని స్థాయిలో హైయర్ ఎడ్యూకేషన్‌ను స్థానికంగానే సమకూర్చుకుని సరస్వతీ నిలయంగా విరాజిల్లుతుంది. ముందు చూపుతో మంత్రి ఓ ప్రణాళిక మేరకు వీటన్నిం టిని ఏర్పాటు చేస్తూ విద్యార్థి లోకానికి రాజబాటలు వేయిస్తున్నారు.