మానవపాడు, మే 11: నిలువ నీడలే దు.. రెక్కాడితేగాని డొక్కాడని కు టుంబం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నది. మానవపాడు మండలంలోని పల్లెపాడుకు చెందిన రాముడు, సువేరమ్మకు ఐదుగురు సంతానం. అందరూ ఆడపిల్లలే. ఉండడానికి ఇల్లు లేదు. చిన్నపాటి రేకుల షెడ్డులో ఆడపిల్లలతో కలసి జీవనం సాగిస్తున్నారు. చాలీచాలని స్థితిలో జీవిస్తూ ఐ దుగరు పిల్లలను చదివిస్తున్నాడు.
కాం గ్రెస్ సర్కారు నిరుపేదలకు ఇందిరమ్మ గృహం మంజూరు చేస్తుందని దరఖాస్తు చేసుకుంటే ఇక్కడున్న రాజకీయ నాయకులు, మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ఇందిరమ్మ గృహం మంజూరు కాలేదని, నా పరిస్థితిని నేరుగా పరిశీలించైనా ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆదుకుంటుందన్న నమ్మకంతో దరఖాస్తు చేసుకుంటే చేదు అనుభవం మిగిలిందని వా పోతున్నాడు. ఐదుగురు అమ్మాయిలతో జీవనం చేస్తున్నా అధికారులకు కనిపించ దా అని ఆరోపిస్తున్నాడు.
ఇండ్లు ఉన్న వా రికి మాత్రమే ఒకటి నుంచి మూడు మం జూరు చేశారని, మాలాంటి పేదలు వారికి కనిపించరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన జాబితాను మాత్రమే అధికారులు ఫైనల్ చేస్తున్నారని.. అసలైన నిరుపేదలకు న్యాయం చేకూరడంలేదని వాపోయారు. ఇల్లులేక కిరాయి ఇంట్లో ఉన్న వారికి ఇల్లు మం జూరు చేయడంలేదని.. గుడిసెల్లో ఉన్నవారికి మాత్రమే ఇల్లు మంజూరు చేస్తామని చెబుతున్న అధికారులకు మేము పూరిగుడిసెలో ఉంటున్నది కనిపించడం లేదా.. ప్రభుత్వం స్పందించి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోతున్నారుకోతున్నారు.