నారాయణపేట : పంచాయతీ ఎన్నికల( Elections) మొదటి విడత పోలింగ్ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు(Show cause notices) జారీ చేశారు. నారాయణపేట జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ( Collector Sikta Nayak ) తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.