సజావుగా రీ నీట్
నీట్ యూజీ-2026 పునఃపరీక్ష ఆదివారం ఉ మ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సజావుగా సాగిం ది. లోపాలకు తావులేకుండా ప్రతి దశలోనూ అధికా ర యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. ప రీక్ష సమర్థ నిర్వహణకు సాయుధ పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మే 3న ని ర్వహించిన నీట్.. పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
- కట్టుదిట్టంగా నిబంధనలు
- సమయం మించి పోవడంతో కొన్ని చోట్ల వెనుదిరిగిన అభ్యర్థులు
- సాయుధ పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు
- పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీలు
- మహబూబ్‌నగర్‌లో 4,291 మందికి గానూ 3,862, గద్వాలలో 987 మందికి 877 మంది అభ్యర్థులు హాజరు
మహబూబ్‌నగర్ కలెక్టరేట్/గద్వాలటౌన్ జూన్ 21: నీట్ యూజీ-2026 పునఃపరీక్ష ఆదివారం ఉ మ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సజావుగా సాగిం ది. లోపాలకు తావులేకుండా ప్రతి దశలోనూ అధికా ర యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. ప రీక్ష సమర్థ నిర్వహణకు సాయుధ పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మే 3న ని ర్వహించిన నీట్.. పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 21న మళ్లీ పరీక్ష మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో ని ర్వహించారు.
మొత్తం 4291 మంది అభ్యర్థులకు గా నూ 3862 మంది హాజరు కాగా 429 మంది గైర్హాజరయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆదివారం నాలుగు పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన నీటీ పరీక్షా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 987 మంది అభ్యర్థులు పరీక్షకు హజరుకావాల్సి ఉండగా 877మంది పరీక్షకు హాజరయ్యారు. 110 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్భూగుప్తా, ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయ క్, జోగుళాంబ గద్వాల జిల్లాలో జిల్లా ఎస్పీ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ శంకర్‌తోపాటు జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు.
కట్టుదిట్టంగా నిబంధనలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల అ మలు కట్టుదిట్టంగా, కచ్చితమైన భద్రత ఏర్పాట్ల మ ధ్య అధికారులు కఠినంగా వ్యవహరించారు. చాలా చోట్ల పలువురు విద్యార్థినులు జడ వేసుకోకుండా రా వడంతో వారిని విధిగా జడ వేసుకోవాలని సూచించడంతో అప్పటికప్పుడు వారు సహాయకులుగా వచ్చిన వారితో, తల్లి, బంధువులతో జడ వేయించుకున్నారు. మొలత్రాడుకు తల్లిదండ్రులు గతంలో కట్టించిన తా యత్తులు, ఇతరత్రా భక్తితో కట్టించుకున్న వివిధ రకా ల దేవుళ్లకు సంబంధించిన బొమ్మలు ఉంటే వాటిని పోలీసులు తొలగించారు.
వాటర్‌బాటిల్ ట్రాన్స్ఫరెంట్గా ఉండాలంటూ బాటిల్‌పై కవర్లు సైతం తొలగించారు. కొందరు చెవులకు కమ్మలు, రింగులతో వస్తే వాటిని తొలగించిన తర్వాతే లోపలకు అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11గంటల నుంచే అభ్యర్థులను అన్ని విధాలుగా తనిఖీలు నిర్వహించి మధ్యాహ్ంన 1:30గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. సమయం దాటిన తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించలేదు. నిర్ధేశిత సమయం ముగియడంతో అభ్యర్థులు కొన్ని కేంద్రాల వద్దకు వచ్చినా వెనుదిరిగి వెళ్లడం కన్పించింది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

