ఎమ్మెల్సీకి 16 నామినేషన్లు
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎ మ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం నాటికి 16 నామినేషన్లు.. మొత్తంగా 28 సెట్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్య ర్థి నవీన్‌కుమార్‌రెడ్డి, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యే లు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి మూడు సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్‌కు అందజేశారు.
- బీఆర్ఎస్ తరఫున దాఖలు చేసిన నవీన్‌కుమార్‌రెడ్డి
- కాంగ్రెస్ అభ్యర్థి సహా మరో 14మంది ఇండిపెండెంట్లు
మహబూబ్‌నగర్, మార్చి 11 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి): స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం నాటికి 16 నామినేషన్లు.. మొత్తంగా 28 సెట్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యే లు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి మూడు సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్‌కు అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్‌రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్లు వేశారు. మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా పోటీకి బీజేపీ దూరంగా ఉండడం గమనా ర్హం. బీఆర్ఎస్, కాంగ్రెస్ మినహా మిగతా 14 మం ది ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. కాగా సోమవారంతో మహబూబ్‌నగర్ స్థానికసంస్థల ని యోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్ దాఖలుకు గడువు ముగిసింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ కోటాలో మొత్తం ఓ టర్లు 1,439 మంది ఉండగా, ఇందులో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 28న అన్ని డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
విజయం తమదే..
ఉప ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్, పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో మీడియా తో మాట్లాడారు. ఉప ఎన్నికలో 990 ఓట్లు బీఆర్ఎస్ పక్షాన ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ డబ్బున్న పారిశ్రామికవేత్తలను నిలబెట్టి ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చే స్తుందని ఆరోపించారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసి నా తమదే విజయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని.. కనీ సం పంచాయతీ ఎన్నికలు కూడా జరుపలేని స్థితి లో ఉన్నదని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ ఎ మ్మెల్సీ స్థానాన్ని గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామన్నారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చిందన్న సం కేతం ఈ ఉప ఎన్నికతో తేటతెల్లమవుతుందన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

