మక్తల్, ఏప్రిల్ 01 : జాతీయస్థాయి ఖో ఖో పోటీలకు టెక్నికల్ ఆఫీసర్గా నారాయణపేట జిల్లా కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిడి రూపా ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల జీహెచ్ఎం వెంకటయ్య గౌడ్ మంగళవారం తెలిపారు. ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 2 నుండి 5వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రం పూరిలో జరిగే జాతీయస్థాయి సీనియర్ మహిళా, పురుషుల ఖో ఖో ఛాంపియన్షిప్ పోటీలకు రూప టెక్నికల్ ఆఫీసర్గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు.
అలాగే తమ పాఠశాల విద్యార్థిని శశిరేఖ జాతీయస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. వరంగల్ జిల్లా గీసికొండలో గడిచిన జనవరి 9 నుండి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా ఖో ఖో పోటీల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి తమ పాఠశాల విద్యార్థిని శశిరేఖ పాల్గొని క్రీడా నైపుణ్యంతో జాతీయ స్థాయి సీనియర్ ఖో ఖో పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. ఒడిశాలో జరిగే పోటీల్లో శశిరేఖ తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నట్లు పేర్కొన్నారు.
Kho Kho Competitions : జాతీయస్థాయి ఖో ఖో పోటీలకు టెక్నికల్ ఆఫీసర్గా పీడీ రూప