రైస్ మిల్లులో రూ.9.68 కోట్ల ధాన్యం మాయం..! 13 మందిపై కేసు నమోదు
నాగర్కర్నూల్ జిల్లాలో సివిల్ సప్లైస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి.
నార్కర్నూల్, అక్టోబర్ 16 : నాగర్కర్నూల్ జిల్లాలో సివిల్ సప్లైస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. నాగర్కర్నూల్ పట్టణ శివారులోని ఓ పార్బాయిల్డ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం సివిల్ సప్లైస్ ద్వారా కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన వరి ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యానికి, మిల్లులో భౌతికంగా ఉన్న ధాన్యానికి మధ్య భారీ తేడా ఉంది. కొరతగా గుర్తించిన ధాన్యం విలువ సుమారు రూ.9.68 కోట్లు గా అధికారులు అంచనా వేశారు. ఈ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
13 మందిపై కేసు..
ఈ వ్యవహారంలో మిల్లు యజమానులు, నిర్వాహకులు, సంబంధిత వ్యక్తులు కలిపి మొత్తం 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు మేరకు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో Essential Commodities Act కింద కేసు నమోదైంది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వానకాలం సీజన్ లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం జిల్లాలోని పలు రైస్ మిల్లులకు కేటాయించారు.
నిబంధనల ప్రకారం ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఈ మిల్లులో మాత్రం ధాన్యం మాయమైంది. జిల్లాలో మిగతా రైస్ మిల్లుల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు.జిల్లాలో ఒకేసారి రూ.9.68 కోట్ల ధాన్యం కొరత బయటపడటం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

