మళ్లీ గోల్డ్ రన్..!
బంగారం ధరలు ఈ ఏడాది తీవ్ర ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఆరంభంలో ఆల్‌టైమ్ హైకి చేరినా.. ఆ తర్వాత క్రమేణా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ మళ్లీ పుంజుకొని వచ్చే ఏడాది తిరిగి రికార్డు స్థాయిలకు వెళ్తాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. అయితే రేట్లు దిగిరావడంతో ఇప్పుడిప్పుడే కొనుగోలుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంచనాలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
- కొత్త ఏడాదిలో రికార్డు ధరలేనా?
బంగారం ధరలు ఈ ఏడాది తీవ్ర ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఆరంభంలో ఆల్‌టైమ్ హైకి చేరినా.. ఆ తర్వాత క్రమేణా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ మళ్లీ పుంజుకొని వచ్చే ఏడాది తిరిగి రికార్డు స్థాయిలకు వెళ్తాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. అయితే రేట్లు దిగిరావడంతో ఇప్పుడిప్పుడే కొనుగోలుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంచనాలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
ఈ ఏడాది గోల్డ్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాల్లో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రధానమైనది. ఈ గల్ఫ్ వార్.. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలను ఒక్కసారిగా ఎగదోసింది. దాంతో దేశ, విదేశీ స్టాక్ మార్కెట్ల కదలికలు, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధానాలు, మదుపర్ల పెట్టుబడి ప్రాధాన్యతలు.. అన్నీ చకచకా మారిపోయాయి. ఈ క్రమంలోనే పసిడికి డిమాండ్ కూడా పడిపోయింది.
పెరుగుతున్న క్రూడాయిల్ రేట్ల దృష్ట్యా ఇన్వెస్టర్లు కరెన్సీ మార్కెట్ వైపునకు తమ పెట్టుబడులను మళ్లించారు. ఫలితంగా అటు అంతర్జాతీయ మార్కెట్లో, ఇటు భారతీయ మార్కెట్లో బంగారం రేట్లు అమాంతం క్షీణించాయి. వెండి ధరల పరిస్థితీ ఇంతే. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, అమెరికా బాండ్లపై రాబడులు పెరుగడం, డాలర్లకు డిమాండ్ బలపడటం వంటివన్నీ బంగారం మార్కెట్ కళ తప్పేలా చేశాయి.
మళ్లీ పెరుగుతాయా?
అమెరికాలో ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ప్రత్యర్థులైన డెమోక్రాట్లు పెద్ద ఎత్తున విజయం సాధించారు. ఈ పరిణామం.. గోల్డ్ మార్కెట్‌పై ఇప్పటిదాకా ఉన్న అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసిందనే చెప్పవచ్చు. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలతో విసుగు చెందామన్న సంకేతాలను అధికార పార్టీ వర్గాలకు అమెరికన్లిచ్చారు మరి.
దీంతో ఇకపై ట్రంప్ దూకుడు తగ్గుతుందని, ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధానికి బ్రేకులు పడుతాయన్న అభిప్రాయాలు మార్కెట్ వ్యాప్తంగా నెలకొన్నాయి. ఈ కారణంగానే ఇప్పటికే మార్కెట్లో ముడి చమురు ధరలూ తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు మళ్లీ తమ పెట్టుబడులకు సురక్షిత మార్గంగా బంగారాన్ని ఎంచుకునే వీలుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇదే జరిగితే వచ్చే ఏడాది జనవరికల్లా గోల్డ్ రేటు మరోమారు రికార్డుల్ని సృష్టించగలదన్న అంచనాలున్నాయి.
వ్యూహాత్మకంగా..
ప్రతి మదుపరి తమ పెట్టుబడుల్లో బంగారానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని మార్కెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఈక్విటీలు, కమోడిటీ, బాండ్లు.. ఇలా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తేనే అనుకోకుండా వచ్చే ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలమని చెప్తున్నారు. అయితే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ఇంకా తొలగిపోలేదని, సెంట్రల్ బ్యాంకులు సైతం గోల్డ్ కొనుగోళ్లపట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. కనుక ఇప్పుడప్పుడే ధరలు పరుగులు పెట్టే వీల్లేకపోయినా.. తాజా ఎన్నికల ఫలితాలు ట్రంప్ అధికారాలను ఒకింత పరిమితం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. కనుక సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు దౌడు తీసే అవకాశాలే ఎక్కువని విశ్లేషిస్తున్నారు. కాబట్టి సరైన ప్లానింగ్‌తో ముందుకెళ్తే రాబడుల్ని ఒడిసిపట్టవచ్చు.
- దేశీయ మార్కెట్లో గత ఏడాది తులం బంగారం ధర రూ.1,37,700 వద్ద ముగిసింది. కిలో వెండి రేటు రూ.2,39,000 దగ్గర ఆగింది.
- 2024తో పోల్చితే 2025లో 10 గ్రాముల పసిడి విలువ రూ.58,750 ఎగబాకింది. అలాగే వెండి రూ.1,49,300 పుంజుకున్నది.
- ఈ ఏడాది జనవరి 29న మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,83,000 పలికింది.
- ఆ ఒక్కరోజే రూ.12,000 ఎగిసింది. అయితే మరుసటి రోజు 30న రూ.14,000 పడిపోవడం గమనార్హం.
- జనవరి 29న కిలో వెండి రేటూ తొలిసారి రూ.4,04,500గా నమోదైంది.
- జనవరి 27న ఏకంగా రూ.40,500 పెరిగింది. కానీ 31న రికార్డు స్థాయిలో రూ.72,500 దిగజారింది.
- ఈ ఏడాది అత్యంత తీవ్రంగా ఒడిదుడుకులకు లోనైన బంగారం, వెండి ధరలు.
- వివిధ ప్రతికూల పరిస్థితుల నడుమ అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లలో విపరీతమైన అప్ అండ్ డౌన్స్.
- ఆల్‌టైమ్ హైని తాకుతూ ఔన్స్ గోల్డ్ 5,600 డాలర్ల దరిదాపుల్లోకి, సిల్వర్ 114 డాలర్ల సమీపానికి చేరిక.
- నిరుడు ముగింపుతో పోల్చితే ఇప్పటికైతే గోల్డ్ వాల్యూ రూ.3,200 పెరిగింది. వెండి రూ.55,000 తగ్గింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

