బ్రేకులు లేకుండానే వందేభారత్ 463 కి.మీ. ప్రయాణం
బ్రేకుల్లేని వందేభారత్ రైలు ఏకంగా 463 కిలోమీటర్లు దూరంవరకు ప్రయాణించింది. ఈ ఘటన రైల్వేశాఖలో కలకలం రేపింది. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ఈ వందేభారత్ రైలు వేగంగా పరుగులు తీసింది.
- ఖాళీ బోగీల ప్రమాదకర పరుగులు n బయటపడిన అధికారుల నిర్లక్ష్యం
రాంచీ: బ్రేకుల్లేని వందేభారత్ రైలు ఏకంగా 463 కిలోమీటర్లు దూరంవరకు ప్రయాణించింది. ఈ ఘటన రైల్వేశాఖలో కలకలం రేపింది. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ఈ వందేభారత్ రైలు వేగంగా పరుగులు తీసింది. అక్టోబర్ 24న ఖాళీ రేక్‌ను హటియా నుంచి దీనదయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌కు సరుకు రవాణా ఇంజిన్‌తో తరలించారు. అన్ని బోగీల బ్రేకులు ఐసొలేషన్‌లో ఉండటంతో ఇంజిన్ బ్రేకులు, రీజెనరేటివ్ బ్రేకింగ్పైనే రైలు ప్రయాణించింది. ప్రయాణం ప్రారంభమైన తర్వాత బ్రేకులు సరిగా పనిచేయడం లేదని లోకో పైలట్ గుర్తించి, రాంచీ స్టేషన్లో అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అయినప్పటికీ రైలును అదే పరిస్థితిలో ముందుకు పంపారు. మూరి స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన మరో లోకో పైలట్ కూడా బ్రేక్ పైప్ ఒత్తిడి తగ్గించినా బ్రేకులు పడటం లేదని హెచ్చరించారు. చివరకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా దీనదయాళ్ ఉపాధ్యాయ స్టేషన్లో తనిఖీ చేయగా, అన్ని బోగీల బ్రేకింగ్ వ్యవస్థలు నిలిపివేసినట్లు గుర్తించారు. కోచ్, వ్యాగన్ నిర్వహణ సిబ్బంది, సెక్షన్, ట్రాక్షన్ కంట్రోలర్లు, రైలును నడిపిన సిబ్బంది నిర్లక్ష్యాన్ని విచారణ అధికారులు గుర్తించారు. బ్రేకులు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయకపోవడం, వందేభారత్ బ్రేకింగ్ వ్యవస్థపై సిబ్బందికి అవగాహన లేకపోవడం ప్రధాన లోపాలుగా వారు తేల్చారు.ఈ ఘటనపై నవంబర్ 7న దక్షిణ తూర్పు రైల్వే (ఎస్ఈఆర్) రాంచీ డివిజనల్ రైల్వే మేనేజర్‌ను సమగ్ర విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

