బకాయిలు చెల్లించలేదనే సాకుతో
రుణ గ్రహీతలు బకాయిలు చెల్లించలేదనే సాకుతో వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి రౌడీలను ఉపయోగించే అధికారం ఫైనాన్స్ సంస్థలకు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
- రౌడీలతో వాహనాల స్వాధీనం వద్దు
- ఫైనాన్స్ సంస్థలకు హైకోర్టు హెచ్చరిక
ప్రయాగ్రాజ్: రుణ గ్రహీతలు బకాయిలు చెల్లించలేదనే సాకుతో వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి రౌడీలను ఉపయోగించే అధికారం ఫైనాన్స్ సంస్థలకు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. బలప్రయోగం చేసే చట్టబద్ధ అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ఆ అధికారాన్ని ప్రైవేట్ పార్టీకి అప్పగించరాదని వివరించింది. రుణం తీసుకుని కొనుగోలు చేసిన వాహనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ఒప్పంద హక్కును సివిల్ కోర్టు లేదా ఆర్బిట్రేటర్ వంటి చట్టబద్ధ వేదికల ద్వారా మాత్రమే అమలు చేయాలని తెలిపింది. సదాబ్ అహ్మద్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను అనుమతిస్తూ, వాహనాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ఆయనకు అప్పగించాలని ఆదేశించింది.
ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఫైనాన్స్ సంస్థను ఆదేశించింది. పీనల్ వడ్డీ లేకుండా రుణాన్ని పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించింది. సదాబ్ అహ్మద్ 2023 డిసెంబర్లో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి రుణం తీసుకుని టాటా గూడ్స్ క్యారియర్ కొనుగోలు చేశారు. ఒక్కో వాయిదా రూ.64,059 చొప్పున 45 వాయిదాల్లో చెల్లించేలా రుణ ఒప్పందం కుదిరింది.2026 ఆగస్టు 9న చందౌలీలో సంస్థ తరఫున వచ్చిన వ్యక్తులు తనను అడ్డగించి, తుపాకీతో బెదిరించి వాహనాన్ని తీసుకెళ్లారని, రీపొజిషన్ ఇన్వెంటరీపై సంతకం చేయించుకున్నారని పిటిషనర్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

