దామరగిద్ద : దామరగిద్ద ఎస్బీఐ బ్యాంకుకు కొత్త మేనేజర్ వచ్చారు. ఇప్పటివరకు మేనేజర్‌గా విధులు నిర్వహించిన జయపాల్ హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొత్త మేనేజర్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే మేనేజర్ బదిలీ కారణంగా కొత్త పంట రుణాలు ఆగిపోయాయి. శనివారం కొత్త మేనేజర్ రావడంతో ఖాతాదారుల ఇబ్బందులు తీరనున్నాయి.
బాధ్యతల స్వీకారం సందర్భంగా నూతన మేనేజర్ మాట్లాడుతూ.. రైతులు తాము తీసుకున్న పంట రుణాలను క్రమం తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని, లేదంటే అపరాధ రుసుములు కలిపి అప్పు భారం పెరిగిపోతుందని అన్నారు. ఖాతాదారులు ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ సేవలైన యోనో యాప్ వేసుకొని వాడుకోవాలని సూచించారు. ఖాతాదారులకు ఏ ఇబ్బందులు కలుగకుండా సేవలు అందిస్తామని చెప్పారు.