నారాయణపేట టౌన్, మే 2 : జిల్లాలో 8వ విడుత హరితహారం పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ చాంబర్ నుంచి సోమవారం జిల్లా అధికారులతో వెబ్‌నార్ నుంచి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో హరితహారం నిర్వహణ, ‘మన ఊరు మన బడి’, దళితబంధు, ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి ల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు మొక్కలు నా టేందుకు అనువైన స్థలాలను గుర్తించి వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు తమ ని ధుల నుంచి 10శాతం గ్రీన్ బడ్జెట్ హ రితహారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో గుర్తించిన పాఠశాలల మరమ్మతులు, ఆధునికీకరణ పనులు ఇంజినీరింగ్ శా ఖ నుంచి కలెక్టర్ లాగిన్‌లో కనిపించే విధంగా అప్లోడ్ చేయాలని, అనుమ తి పొందిన వాటిలో వెంటనే పనులు ప్రారంభించాలన్నా రు. డీఆర్డీఏ, ఉపాధి హామీ నుంచి పనులు చేపట్టి, సకాలం లో మస్టర్లో అప్లోడ్ జరిగే విధంగా చూడాలన్నారు. ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అధికారులు క్రమం తప్పకుండా కేంద్రాలను సందర్శించాలని సూచించారు.
అదనపు కలెక్టర్ పద్మజారాణి మాట్లాడుతూ హరితహారానికి కావలసిన మొక్కలు అటవీశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ నర్సరీల్లో ఏ స్థాయిలో ఉన్నాయో వివరాలు అడిగి తె లుసుకున్నారు. మొక్కలు ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకుంటే అటవీశాఖ సిబ్బంది సలహాలతో జీవామృతం క్ర మం తప్పకుండా వేస్తూ మొక్కలు ఎదిగేలా చూడాలన్నా రు. అటవీశాఖ ఆధ్వర్యంలో 1.95లక్షల మొక్కు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో 70లక్షల మొక్కలు నర్సరీలలో సిద్ధంగా ఉ న్నాయన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ గోపాల్‌నాయక్, డీఎఫ్‌వో వీణావాణి, సివిల్ సైప్లె అధికారి శివప్రసాద్‌రెడ్డి, ఆర్డీవో రామచందర్‌నాయక్, జిల్లా అధికారులు, మండల అభివృ ద్ధి అధికారులు, ఎంపీవోలు, డీటీలు, వివిధ శాఖల అధికా రులు తదితరులు పాల్గొన్నారు.