నారాయణపేట టౌన్, ఏప్రిల్ 18 : ప్రభుత్వ ద వాఖానల్లో అన్ని రకాల వసతులు కల్పించడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందజేస్తుండడంతో పేద, ధనిక తేడాలేకుండా అందరూ ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ హరిచందనతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యం గా ఉండాలంటే ప్రతి ఆరు నెలల కు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకొని అనారోగ్య సమస్యలు ఉం టే చికిత్సలు తీసుకోవాలని సూ చించారు. పేదల కోసం ప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్ కిట్ లాంటి ప్ర భుత్వ పథకాలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిం దన్నారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ మెగా హెల్త్ క్యాంపు ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిబిరంలో బీపీ, షుగర్ వంటి వ్యాధులతోపాటు కంటి జబ్బులు, దం త సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలను నిర్ధారించి, ఉచితంగా వైద్యం, మందులు ఇస్తారని తెలిపారు. అలోపతితోపాటు ఆయుర్వేదం, యునాని, హోమియో వైద్య చికిత్స లు అందించనున్నట్లు చెప్పారు. ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు. శిబిరంలో మొత్తం 11 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రామ్మనోహర్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో శైలజ, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.