నారాయణపేట టౌన్, మార్చి 21 : సంక్షేమ చట్టాలపై ప్రతిఒక్క రూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హరిచందన స్పష్టం చేశా రు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2017, దివ్యాంగుల చట్టం 2016 తెలుగు అనువాదపు పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఒక్కరికీ వయో వృద్ధుల సంక్షేమ చట్టాలపై అవగాహన కల్పించేలా తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పుస్తకాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. వ యో వృద్ధుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 14567, దివ్యాంగుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800572 8980 ఉందని, నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే నిరాశ్రయులకు ఆధారణ, వేధింపులకు గురువుతున్న పెద్దల సంరక్షణ, మానసిక భావోద్వేగాలకు సలహా, సూచనలు, చట్టపరమైన మార్గదర్శకత్వం, వృద్ధాశ్రమాల సంరక్షకుల గురించి స మాచారం తెలుసుకోవచ్చారు.
జిల్లాలోని వయోవృద్ధులు తమ పిల్లల నుంచి సరైన ఆదరణ లభించనట్లయితే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందు కోసం ఆర్డీవో కార్యాలయంలో ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 14567 నెంబర్‌కు కాల్ చేసినట్లయితే వారికి సహాయం చేయడానికి నియమించామన్నా రు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ సాయి తదితరులు పాల్గొన్నారు.