నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 21 : మాతృభాష తెలుగును రక్షించుకోవాలని ఉపాధ్యాయులు నాగార్జునరెడ్డి, రెడ్డె ప్ప అన్నారు. మండలంలోని బొమ్మన్‌పాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అంతర్జాతీయ మాతృభా షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ మాతృభాషను చక్కగా నేర్చుకొని దానిపై పట్టుసాధిస్తే మిగతా భాషలు నేర్చుకోవడం సులభమవుతుందన్నారు. మాతృభాషలో సంభాసిస్తేనే మన భావాలను, అభిప్రాయాలను స్పష్టంగా, సూటిగా చేరవేయవచ్చన్నారు. అ నంతరం విద్యార్థులు పద్యపఠనాలు, ఉపన్యాసాలు ఇచ్చా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాల్యానాయక్, రా ములు, శిరీష, శివకుమార్, అనిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల కవి సమ్మేళనం
మండలవ్యాప్తంగా వివిధ ప్ర భుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వి ద్యార్థులు సోమవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామా ల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు మాతృభాష ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులతో కవి సమ్మేళనం నిర్వహించి ఆకట్టుకున్నారు. అలాగే విద్యార్థులకు ఉపన్యాసం, పాటల పోటీలు నిర్వహించి మాతృ భాష గొప్పదనాన్ని వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, గురునాథ్, నాగం శేఖర్‌రెడ్డి, సురేశ్, శ్రీ నివాసులు, జగదీశ్‌కుమార్, శ్రీవిద్య, సునంద తదితరులు పాల్గొన్నారు.
కన్సీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మండలంలోని కన్సీ జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం, ప ద్యాలు, పుస్తక ప్రదర్శన, పాటలు, వ్యాసరచన పోటీలు ని ర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతు లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కోస్గి మండలంలో…
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఆయా పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. మండలంలోని నాచారం ప్రభుత్వ పాఠశాలలో సోమవా రం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ము శ్రీఫా జిల్లా పరిషత్ పాఠశాలలో చిత్రలేఖన పోటీలు, పట్టణంలోని బాహర్పేట్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయు లు విద్యార్థులకు మాతృభాష ప్రాముఖ్యతను తెలియజేశా రు. మాతృభాషతోనే విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందని ఉపాధ్యాయులు సూచించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు.
బహుమతులు పంపిణీ
మండలంలోని పంచలింగాల ప్రాథమిక పాఠశాలలో సోమవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వి ద్యార్థులకు వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు భీంరెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తిక్కమ్మ, విద్యా కమిటీ చైర్మన్ భీరప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
మండలకేంద్రంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు, పుస్తక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం నర్సింహులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.