ఇంటింటి ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ..కరపత్రాలు పంపిణీ చేస్తూ ..
వార్డుల్లో జోరుగా ప్రచారం
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 26: మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతుండడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరు పెంచారు. గడపగడపకూ వెళ్తూ విస్తృత ప్రచారం చేస్తున్నా రు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆదరించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రగతికి జై కొట్టాలని ఓటర్లను కోరుతున్నారు. జడ్చర్ల మున్సిపాలిటి పరిధిలోని 27వార్డుల్లో సోమవారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
1వ వార్డులోటీఆర్ఎస్ అభ్యర్థి ఫెహిమినాజ్ అంబాభవానీ ఆలయం, పోటుగడ్డ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే అభివృద్ధి జరుగుతుందని ఓటర్లకు వివరిస్తున్నారు.
2వ వార్డులో అభ్యర్థి బుక్క మహేశ్ గుల్షన్‌నగర్, ఆదర్శనగర్కాలనీ, ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికీ కరపత్రాలు అందించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
3వ వార్డులో అభ్యర్థి సతీశ్ గౌరీశంకర్ కాలనీ, సత్యనారాయణ టెంపుల్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లకు కరపత్రాలను అందజేశారు.
4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దేవా మాధవరావు కాంపౌండ్ , వెంకటేశ్వరకాలనీ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
5వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కుమ్మరి నవనీత నాగసాల, నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చెబుతూ ప్రచారం చేశారు.
6 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సుంకసారి రమేశ్ హరిజనవాడ, జవహర్‌నగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాదేవి బూరెడ్డిపల్లి, శివాలయం వీధి, ఎస్సీ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దోరేపల్లి లక్ష్మి హౌసింగ్‌బోర్డుకాలనీ, ప్రశాంత్‌నగర్‌లో విస్తృత ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హౌసింగ్‌బోర్డుకాలనీ మరింత అభివృద్ధికి నోచుకుంటుందని ఓటర్లకు వివరించారు.
9వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చైతన్య నక్కలబండతండా, శంకరాయపల్లితండాలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
10వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నడిమింటి రవి కుమ్మరివాడి, బాలాజీనగర్, సంతోష్‌నగర్, గాంధీచౌరస్తాలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే వార్డు లో మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బండమీది జ్యోతి బాబానగర్ ప్రాంతంలో ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి రఘురాంగౌడ్ శ్రీనివాస్కాలనీలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డులో అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ ఇంటింటికెళ్లి ఓటర్లను కలిశారు.
13వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్‌గౌడ్ చైతన్యనగర్కాలనీ, వెటర్నరీ దవాఖాన వెనుక ప్రాంతంలో జోరుగా ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కరపత్రాలను అందిస్తూ ఓటర్లను కలిశారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్ టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు.
14వ వార్డులో కోనేటి పుష్పలత త్రిశూల్‌నగర్, బక్కారావు కాంపౌండ్ ఏరియా, హనుమాన్ స్ట్రీట్‌లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తెలంగాణ సంగీత,నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో 70 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
15వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సారిక ప్రచారం చేశారు. గుండప్పకంపౌండ్, ఎల్బీ స్ట్రీట్, కేపీ స్ట్రీట్, భాగ్యలక్ష్మీకాలనీ, రాఘవేంద్ర థియేటర్ ఏరియాలో ప్రచారం చేశారు.
16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి స్వాతి రాంమందిర్, శివాజీనగర్, నటరాజ్ స్ట్రీట్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకుంటుందని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చైతన్య వాల్మీకినగర్, శాంతినగర్, దర్గా ప్రాంతంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గురించి వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున పాలమూరు బిత్తిరిసత్తి ప్రచారం చేస్తూ హల్చల్ చేశారు.
18వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మొఖిద్ ఫజల్‌బండ అక్బర్ మసీదు, హనుమాన్ టెంపుల్ ఏరియా, మదీనామసీదు ప్రాంతంలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
19వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సాజిదాసుల్తానా ఎర్రసత్యం కాలనీ, ఫజల్‌బండ ప్రాంతంలో ప్రచారం చేశారు. వార్డులో అభివృద్ధి పనుల కోసం టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సినవసరం ఉందని కోరారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికెళ్లి కరపత్రాలను అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మిడ్జిల్ మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు.
20వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రావణి మదీనాతులుమ్ పాఠశాల, గంజ్ ఏరియాలో ప్రచారం చేశారు. జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఇంటింటికెళ్లి ప్రచారం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
21వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వంగూర్ హరిత పాతబజార్ పీర్లమసీదు, హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ప్రాంతం, సింగిల్‌విండో కార్యాలయం వెనుక ప్రాంతంలో ప్రచారం చేశారు.
22వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కావలి శ్రీశైలమ్మ హరిజనవాడ, పాతబజార్ హనుమాన్ దేవాలయం వెనుక ప్రాంతంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య ప్రచారం చేశారు.
23వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాశంకర్‌గౌడ్ మదీనాకాలనీ, వెంకటపతిరావుకాలనీ, హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ఏరియాలో ప్రచారం చేశారు. మాంసం మార్కెట్లో మటన్ కొడుతూ వినూత్నంగా ప్రచారం చేశా రు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
24వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డి రంగారావుతోట, పద్మావతికాలనీ, హుడాకాలనీలో ప్రచారం చేశారు. రాజాపూర్ మండల టీఆర్ఎస్ నాయకుడు అభిమన్యురెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున కాలనీల్లో తిరిగి ప్రచారం చేశారు.
25వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి లత లక్ష్మీనగర్‌కాలనీ, ఇందిరానగర్, వికాస్‌నగర్, జకీనగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
26వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆలూరి శశికిరణ్ వెంకటేశ్వరకాలనీ, సయ్యద్వాడీ ప్రాంతంలో ప్రచారం చే శారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
27వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్మడియాదయ్య గాంధీనగర్, ఇందిరానగర్ కాలనీ లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కరపత్రాలను ఓటర్లకు ఇస్తూ ప్రచారం చే శారు.