ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి
జడ్చర్ల, ఏప్రిల్ 25: జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపాలిటీలోని 1, 2, 7, 12, 22, 24 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. 22వ వా ర్డులో శ్రీశైలమ్మ తరఫున హనుమాన్ ఆలయం, హరిజనవాడ, 7వ వార్డులోని హరిజనవాడ, శివాలయం వీధి, పోచమ్మ ఆలయంలో ప్రచారం చేశారు. 24వ వార్డు లో కోట్ల ప్రశాంత్‌రెడ్డి తరఫున రంగారావుతోట, పద్మావతికాలనీ, క్లబ్‌రోడ్‌లో ప్రచారం నిర్వహించగా, 12వ వార్డులో రఘురాంగౌడ్ తరఫున కేకేనగర్, గాంధీనగర్, కోర్టు ప్రాం తంలో, 1వ వార్డులో ఫహిమీన్హాజ్ తరఫున మన్సూర్దాబా, పొట్టుగడ్డ, అంబాభవానీ ఆలయం, మసీద్ ప్రాంతం, 2వ వార్డులో బుక్కమహేశ్ తరఫున కావేరమ్మపేట పోస్టాఫీసు, పాత శివాలయం ప్రాం తం, గుల్షన్‌నగర్‌లో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడు తూ జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో 27 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిచిపించి 27సీట్లకు 27సీట్లు సాధించి రికార్డు సృష్టిస్తామన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అ భివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అం దుతున్నాయన్నారు. ఏడేండ్లలోనే జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రోడ్ల విస్తరతోపాటు రెండు మినీ ట్యాంకుబండ్లు మంజూరు చేసి ఒకటి ప్రారంభించామన్నా రు. బాదేపల్లి పట్టణంలో మటన్మార్కెట్ను ఆధునీకరించామన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 100పడకల దవాఖాన మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, మార్కె ట్ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ చైర్మన్ మురళి, డైరెక్టర్ సుభాశ్, నాయకులు శివయ్య, రఘుపతిరెడ్డి, ఏక్‌నాథ్‌రెడ్డి, నర్సింహులు, నాగిరె డ్డి, తోటారెడ్డి, సర్పంచులు శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశ్, సూర్యప్రకాశ్‌రెడ్డి, మొగులయ్య, శ్రీశైలంయాదవ్, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఉన్నారు.