Cycling Competetions | మక్తల్, మార్చి 10 : తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ మౌంటెన్ సైక్లింగ్ పోటీలలో నారాయణపేట జిల్లా విద్యార్థులు సమాన ప్రతి ఒక్కరు వచ్చి గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపాలం అన్నారు.
ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుండి 9 వరకు రంగారెడ్డి జిల్లా కోహెడ అడవుల్లో జరిగిన తొమ్మిదవ రాష్ట్రస్థాయి మౌంటెన్స్ సైక్లింగ్ పోటీలలో, రాష్ట్ర నలుమూలల నుండి 242 మంది బాలబాలికలు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ పోటీలలో నారాయణపేట జిల్లా నుండి 37 మంది బాలబాలికలు పాల్గొని, రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో అసమాన క్రీడాకా నైపుణ్యతను ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు.
అనూషకు గోల్డ్ మెడల్..
18 సంవత్సరాల లోపు జూనియర్ మహిళా విభాగంలో 10 కిలోమీటర్ల మౌంటెన్ సైక్లింగ్ పోటీల్లో నర్బ మండలం రాయకోడ గ్రామానికి చెందిన టి అనూష గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన అనూష ఈనెల 28 నుండి 31 వరకు హర్యానా రాష్ట్రంలో పంచకులు అడవుల్లో జరుగు జాతీయ స్థాయి మౌంటెన్ పోటీల లో పాల్గొంటుందని.. అలాగే 16 సంవత్సరాల లోపు సైక్లింగ్ పోటీల్లో త్రివేణి నాలుగవ స్థానం, పల్లవి ఏడో స్థానం, రాఘవేంద్ర పదవ స్థానం, శ్రీపాద 16వ స్థానం సాధించడం జరిగిందన్నారు.
14 సంవత్సరాలలోపు కే అంబికా ఏడవ స్థానం, సాక్షిత ఎనిమిదవ స్థానం, కే మల్లీశ్వరి తొమ్మిదవ స్థానం, డి అఖిల 15వ స్థానం, పొందారన్నారు. 15 సంవత్సరాల లోపు మమతా నాలుగో స్థానం, గాయత్రి ఏదో స్థానం సాధించడం జరిగిందని పేర్కొన్నారు.
ఎలైట్ పురుషుల విభాగంలో పరశురాములు ఎనిమిదవ స్థానం, ఎస్ రమేష్ కుమార్ తొమ్మిదవ స్థానం, మాస్ మౌంటెన్ సైక్లింగ్ పోటీలలో పి శ్రావణి ఏడవ స్థానం, కే గాయత్రి ఏదో స్థానం, అనూష ఎనిమిదవ స్థానం, రామాంజనేయులు ఆరవ స్థానం, రవి రాథోడ్ 15వ స్థానం, పవిత్ర 21వ స్థానం సాధించి మెమొటోలు అందుకోవడం జరిగింది అన్నారు.
గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థినికి సీఎఫ్ఐ ఇండియా ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి మల్లారెడ్డి, ఇండియా కోచ్ మాక్సిన్ వెల్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాయి సైక్లింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన ప్రతి క్రీడాకారుని సత్కరించడం జరిగిందని తెలిపారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి