మరికల్, ఆగస్టు 25 : విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని లక్ష్యంతోనే కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. సోమవారం మరికల్ మండలంలోని పసుపుల కేజీబీవీ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు పౌస్తికమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు.
అలాగే మరికల్ మండల కేంద్రంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి ఫర్టిలైజర్ షాపును ప్రారంభించారు. అనంతరం దన్వాడ మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘీక సంక్షేమ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామకోటి, ఎంపీడీవో కొండన్న, కేజీబీవీ ఎస్ఓ రాజ్యలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న, హరీష్ కుమార్, మధుసూదన్ రెడ్డి, రవి గౌడ్, రాజు, పెంట మీద రఘు, గోవర్ధన్, చెన్నయ్య, తిరుమలయ్య, మంగలి రఘు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.