నారాయణ పేట, ఫిబ్రవరి 12: నారాయణపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్.సీ.డీ క్లినిక్ ను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ క్లినిక్ లో అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బిపి, షుగర్ వ్యాదిగ్రస్తులకు సకాలంలో సేవలు, మందులు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే ప్రజలు ఎన్.సీ.డీ క్లీనిక్ లో అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ 30 సంవత్సరాలు పైబడినవారు తప్పకుండ బిపి, షుగర్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కలాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకిషన్, జిల్లా ఆసుపత్రి సుపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున్, ఆర్.ఏం.ఓ డాక్టర్ జయచంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మెన్ శివారెడ్డి ఆసుపత్రి సిబ్బంది పాల్గోన్నారు.