నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 1 : సంక్షేమ పథకా ల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థా నంలో ఉందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు సింగారం చౌరస్తాలోని స్కిల్ డెవలప్మెంట్ సెంట ర్, కొల్లంపల్లి, అప్పిరెడ్డిపల్లి, కోటకొండ గ్రామాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్తో కలిసి 1,2 94 లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు రూ.3016, వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు రూ.2016 ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మండలంలో నెలకు రూ.2కోట్ల చొప్పున ఏడాదికి రూ.24కోట్లు పింఛన్ల రూపంలో చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
పని చేసే ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ అండ గా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ సుగుణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తా జుద్దీన్, మండల్ కోఆప్షన్ సభ్యుడు జావిద్, రైతుబంధు సమితి జిల్లా స భ్యుడు కోట్ల జగన్మోహన్రెడ్డి, టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు రాములు, డీఆర్డీఏ పీడీ గోపాల్‌నాయక్, ఎంపీడీవో సందీప్‌కుమార్, సర్పంచులు, ఎంపీ టీసీలు, కార్యదర్శులు, నాయకులు త దితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మొత్తం 15 మందికి గానూ రూ.5,27,500 చెక్కులను పంపిణీ చేశారు.