Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ పరిధిలోని చెరువు నిండి సుమారు రెండు నెలలుగా అలుగు పారుతోందని, కాల్వల ద్వారా వెళ్లాల్సిన సాగునీరు వృథాగా వాగుల్లో కలుస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.
Sangam Banda Reservoir | మాగనూరు : రైతులకు సాగునీరు అందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నీరు వృథాగా పోతున్నా, పంటలకు మాత్రం సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. సంగం బండ రిజర్వాయర్ రైట్ లెవెల్ కెనాల్‌కు గండి పడటంతో సాగునీరు చెరువులోకి, అక్కడి నుంచి వాగులోకి ప్రవహిస్తోంది. కాల్వకు మరమ్మతులు చేసి పూడిక తొలగిస్తే వందల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదని అచ్చంపేట, అడవి సత్యారం గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీరు పుష్కలంగా ఉన్నా.. రైతులకు అందని వైనం!
రిజర్వాయర్ పరిధిలోని చెరువు నిండి సుమారు రెండు నెలలుగా అలుగు పారుతోందని, కాల్వల ద్వారా వెళ్లాల్సిన సాగునీరు వృథాగా వాగుల్లో కలుస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకవైపు పంటలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. కాల్వకు పడిన గండిని పూడ్చి, పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరిస్తే సుమారు 300 నుంచి 400 ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు పేర్కొంటున్నారు.
గండి పూడ్చకుండా గేట్లు మూస్తే సమస్య పరిష్కారమైనట్టేనా..?
కాల్వకు గండి పడిన విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, రైతులకు సాగునీరు అందించాల్సిన అధికారులు సంగం బండ రిజర్వాయర్ గేట్లు మూసివేసి సమస్య పరిష్కారమైందని చెబుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే గేట్లు మూసివేయడం వల్ల కాల్వకు పడిన గండి పూడిపోతుందా? పేరుకుపోయిన పూడిక తొలగిపోతుందా..? రైతుల పొలాలకు సాగునీరు చేరుతుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కాల్వకు శాశ్వత మరమ్మతులు చేపట్టి, నీరు వృథా కాకుండా సరైన ప్రణాళికతో సాగునీటిని పొలాలకు మళ్లించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించి పరిష్కరించాల్సిన అధికారులు గేట్లు మూసివేయడానికే పరిమితమైతే రైతులకు ప్రయోజనం ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ లక్ష్యం నీటి సంరక్షణా..? వృథాను చూస్తూ ఉండటమా..?
ప్రతి చుక్క నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కళ్లముందే సాగునీరు వాగుల్లోకి ప్రవహిస్తుంటే దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాల్వల నిర్వహణకు నిధులు కేటాయించడం, పూడిక తొలగించడం, గండ్లను పూడ్చడం వంటి పనులు సకాలంలో చేపట్టకపోతే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు కలగాల్సిన ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి సంగం బండ రిజర్వాయర్ రైట్ లెవెల్ కెనాల్‌ను పరిశీలించి, గండిని పూడ్చి, పూడిక తొలగించి సాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని అచ్చంపేట, అడవి సత్యారం గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. వృథాగా పోతున్న నీటిని 300 నుంచి 400 ఎకరాల పంటలకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రైతుల ప్రశ్న ఒక్కటే..
సాగునీరు అందించాల్సిన కాల్వలకు మరమ్మతులు చేయడం అధికారుల బాధ్యత కాదా..? అందుబాటులో ఉన్న నీరు వాగుల్లో కలుస్తుంటే రైతులు తమ పంటలకు నీటి కోసం ఎవరిని ఆశ్రయించాలి..? ఇప్పటికైనా ప్రభుత్వం, ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేస్తారా? అన్నది వేచి చూడాలి.

Read Also :
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కూట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
CTI Letter | పదిలక్షల మందితో నిరసనకు దిగితే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి.. రాహుల్‌గాంధీకి ట్రేడర్స్ మరో లేఖ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

