మరికల్, ఏప్రిల్ 01 : పేదలు కడుపునిండా భోజనం చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి తెల్లకార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినట్లు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీతో పాటు రాబోవు రోజుల్లో రేషన్ షాపుల ద్వారా ఉచితంగా మరిన్ని సరుకులు పంపిణీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కిష్టంపల్లి రోడ్డు దగ్గర మసీదుకు సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని ముస్లింలు ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో అంతర్గత డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్యమోహన్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు వీరన్న, పట్టణాధ్యక్షుడు హరీశ్‌కుమార్, జిల్లా ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు, కేడి ఆర్, లంబాడి రాములు, రామకృష్ణ, రఘుపతిరెడ్డి, చెన్నయ్య, మండల డీలర్ల సంఘం అధ్యక్షుడు ముకుందారెడ్డి , డీలర్లు తిరుపతిరెడ్డి జనార్దన్, నరహరి, జయసింహారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, మొగులప్ప, నారాయణపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు పాల్గొన్నారు.
MLA Parnika Reddy : పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం పంపిణీ : ఎమ్మెల్యే పర్ణికారెడ్డి