మక్తల్, మార్చి 06; మక్తల్ మండలంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని చెప్పడానికి నిదర్శనం మక్తల్ మండలం కొండ దొడ్డి వాగు సమీపంలో భారీగా నిల్వచేసిన ఇసుకడంపులే అందుకు నిదర్శనం అవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సమాచార కాలం గడుస్తున్నప్పటికీ, మక్తల్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చోట, బడా నాయకులు తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే పేరుతో భారీ మొత్తంలో ఇసుకను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తూ, సొమ్మును జమ చేసుకుంటున్నారు.
మక్తల్ మండలం కొండ దొడ్డి వాగులో అదే మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వాగులో ఇసుకను తరలిస్తూ నర్వ మండల కేంద్రంలోని కల్వల, సిపురం, పాతర్చేడ్ తదితర గ్రామాలకు ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఇసుకను తరలిస్తున్నప్పటికీ, వారిని నివారించడంలో పోలీస్ యంత్రాంగం రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని ఆయా గ్రామాల్లోని ప్రజలు వాపోతున్నారు. కొండ దొడ్డి వాగు లో కాంగ్రెస్ నాయకులు జోరుగా ఇసుక తీసివేయడం వల్ల వాగు సమీపంలోని, పొలాల్లో బోర్లు ఇంకిపోయే ప్రమాదం ఉందని, వాగుపై ఆధారపడి బోర్లు వేసుకున్న రైతుల పరిస్థితి ఇబ్బందులుగా మారే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.