గర్భిణిలు, బాలింతలు పోషకాహారంపై శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ ప్రియాంక
తల్లుల ఆరోగ్యమే ఆరోగ్యవంతమైన తరానికి పునాది అని జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. గర్భిణిలు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఊట్కూర్, సెప్టెంబరు 18 : తల్లుల ఆరోగ్యమే ఆరోగ్యవంతమైన తరానికి పునాది అని జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. గర్భిణిలు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామ రైతువేదికలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మహిళలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.
బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు గర్భధారణ ప్రారంభం నుంచే తల్లి ఆరోగ్యం, పోషకాహారం కీలకమన్నారు.
ప్రసవం అనంతరం శిశువుకు వెంటనే ముర్రుపాలు అందించాలని, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఆరు నెలల్లోపు పిల్లలకు నీరు, తేనె వంటి ప్రత్యామ్నాయ ఆహారాలు ఇవ్వొద్దన్నారు. బాలింతలు సంప్రదాయ నమ్మకాలతో ఆహార పదార్థాలను దూరం చేయకుండా వైద్యుల సూచనల మేరకు సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు.
చిన్నారులకు అధిక ఉప్పు, నూనెతో తయారైన ప్యాకేజ్డ్ స్నాక్స్, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచాలని సూచించారు. పప్పులు, కూరగాయలు, ఆకుకూరలతో పోషకాహారం అందించాలన్నారు.
18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేయకుండా చట్టాన్ని పాటించాలని కోరారు. గర్భిణీల ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి వైద్య సేవలు అందేలా ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రక్తహీనత ఉన్న గర్భిణిలను గుర్తించి వెంటనే చికిత్స అందించాలన్నారు. తక్కువ బరువు, పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా గర్భిణిలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేందర్ గౌడ్, సీడీపీఓ వెంకటేశ్వరమ్మ, సూపర్వైజర్ అంజమ్మ, సర్పంచ్ రాములు, అంగన్వాడీ టీచర్ జ్యోతిలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

