మక్తల్, ఏప్రిల్ 01 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం అందించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ మున్సిపాలిటీలోని చౌకదార దుకాణం నంబర్- 6లో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రోటి, కపడా, మఖాన్, గరీబీ హఠావో, ఇందిరమ్మ ఇల్లు లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగిందన్నారు. అదే తరహాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి సైతం రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, బి కే ఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి, రేషన్ డీలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.