Maganuru | రైతు సమస్యలపై గళమెత్తితే అరెస్టులా?.. హామీలు అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం..!
మాగనూరు, సెప్టెంబర్ 07: రైతు సమస్యలపై గళమెత్తిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ మాగనూరు మండల యువజన అధ్యక్షుడు పల్లె మారెప్ప ఖండించారు
మాగనూరు, సెప్టెంబర్ 07: రైతు సమస్యలపై గళమెత్తిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ మాగనూరు మండల యువజన అధ్యక్షుడు పల్లె మారెప్ప ఖండించారు. రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై మారెప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న రామ్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దాంతో, ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే రామ్మోహన్ రెడ్డి వంటి వారి గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆర్ఎస్ పార్టీ మాగనూరు మండల యువజన అధ్యక్షుడు పల్లె మారెప్ప విమర్శించారు.
“రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడుతున్న రామ్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోంది. అందుకే అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది” అని పల్లె మారెప్ప అన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని మారెప్ప స్పష్టం చేశారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

