కూతుళ్లుంటే కలదు సుఖం!
ఎంత మంది పిల్లలుంటే మంచిది.. ఇది ఎంతో మంది తల్లిదండ్రుల్లో వినిపించే మాట. సైన్స్ ప్రకారం సంతోషంగా జీవించాలంటే ఇద్దరుండాలి. ఒక కూతురున్న తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తున్నారు. అందులోనూ ఇద్దరు ఆడపిల్లలున్న పేరెంట్స్ ఎక్కువ సంతోషంగా జీవిస్తున్నారని తేలింది. ఉదాహరణకు.. ఒబామా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.
- ఇద్దరు ఆడపిల్లలున్న తల్లిదండ్రులే ఎక్కువ సంతోషంగా ఉంటారు
- చైనా పరిశోధకుల అధ్యయనం
బీజింగ్ : ఎంత మంది పిల్లలుంటే మంచిది.. ఇది ఎంతో మంది తల్లిదండ్రుల్లో వినిపించే మాట. సైన్స్ ప్రకారం సంతోషంగా జీవించాలంటే ఇద్దరుండాలి. ఒక కూతురున్న తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తున్నారు. అందులోనూ ఇద్దరు ఆడపిల్లలున్న పేరెంట్స్ ఎక్కువ సంతోషంగా జీవిస్తున్నారని తేలింది. ఉదాహరణకు.. ఒబామా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.
అలాగే నటుడు ర్యాన్ గోస్లిన్, ఇవా మెండిస్ దంపతులకూ ఇద్దరు ఆడపిల్లలే. ఈ జంటలు జీవితంలో అత్యంత సంతోషంగా జీవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. చైనాకు చెందిన జెజియాంగ్ గోంగ్ షాంగ్ వర్సిటీకి చెందిన పరిశోధకులు 2012 నుంచి 2021 వరకు వివిధ దశల్లో తాము నిర్వహించిన సర్వేలను పరిశీలించారు. ఈ సర్వేల్లో 49,752 కుటుంబాలు పాల్గొన్నాయి.
కూతుర్లతోనే అధిక సంతోషం..
పిల్లల సంఖ్య, పిల్లల లింగం, తల్లిదండ్రుల సంతోషం మధ్య సంబంధాలను గత సర్వేల ఆధారంగా పరిశోధకులు అంచనా వేశారు. ముఖ్యంగా మధ్య వయసున్న ఒక్క కుమార్తె ఉన్న తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నామని చెప్పగా.. ఇద్దరు కూతుర్లున్న పేరెంట్స్ ఎక్కువ సంతోషంగా ఉన్నామని చెప్పారని పరిశోధకుల నివేదిక తెలిపింది. కుమార్తెలు భావోద్వేగాలను ఎక్కువగా వ్యక్తపరచడం, కుటుంబ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. తల్లిదండ్రులతో ఎక్కువ సేపు గడుపుతున్నారని నివేదిక తెలిపింది.
అదే అబ్బాయిలు అయితే భావోద్వేగాలను నియంత్రించుకోవడంతో పాటు.. తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపలేకపోవడం, పనితీరు, బాధ్యతల వైపు ఎక్కువగా సమయం కేటాయిస్తుంటారు. అలాగే తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్లినప్పుడు కూతుర్లే వారితో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు నివేదిక తెలిపింది. తల్లిదండ్రుల భావోద్వేగాలను కూతుర్లే ఎక్కువగా పంచుకోవడం వల్ల.. ఇద్దరు కూతుర్లున్న తల్లిదండ్రులు ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు నివేదిక చెబుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

